ట్రంప్‌ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి సిద్ధం:జెలెన్‌స్కీ

ట్రంప్‌ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి సిద్ధం:జెలెన్‌స్కీ

అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలపై ఉక్రెయిన్ అధినేత జెలన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని, అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి తాను సిద్ధమేనని పేర్కొన్నారు. అమెరికాతో సంబంధాలను కాపాడుకోగలనని, నిర్మాణాత్మక సంభాషణ కోసం అమెరికా అధ్యక్షుడు ఆహ్వానిస్తే మరోసారి భేటీకి వెళతానని చెప్పారు.

ట్రంప్‌ ఆహ్వానిస్తే మరోసారి భేటీకి సిద్ధం:జెలెన్‌స్కీ


సోషల్ మీడియాలో వీడియో సందేశం
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో శ్వేతసౌధంలో జరిగిన చర్చలు రసాభాసగా మారడంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్‌స్కీ బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ముగింపుపై చర్చించేందుకు లండన్‌లో ఐరోపా దేశాధినేతలతో జెలెన్‌స్కీ సమావేశమయ్యారు. అనంతరం తాజా పరిణామాలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో సందేశం విడుదల చేశారు.
వాస్తవమైన భద్రత ముఖ్యం
ఐరోపా నుంచి తమకు పూర్తి మద్దతు ఉందనేది మరోసారి స్పష్టమైందన్న జెలెన్ స్కీ .. శాంతి పునరుద్ధరణ అనే ప్రధాన అంశంపై అంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు వాస్తవమైన భద్రతా హామీలు ముఖ్యమన్నారు. యుఎస్ నుంచి తమకు అందుతున్న సాయంపై ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, వారికి కృతజ్ఞతలు తెలుపని రోజు లేదని అన్నారు. సుదీర్ఘ యుద్ధం కాదు.. మాకు శాంతి కావాలి. అందుకే భద్రతా హామీలు ముఖ్యమని చెబుతున్నామని జెలెన్‌స్కీ పునరుద్ఘాటించారు.

Related Posts
డిసెంబరులో 6 విమాన ప్రమాదాలు 234 మరణాలు
డిసెంబరులో 6 విమాన ప్రమాదాలు, 234 మరణాలు

డిసెంబర్ నెలలో వరుసగా జరిగిన ఘోరమైన విమాన ప్రమాదాలు విమానయాన భద్రతపై గంభీర ప్రశ్నలను లేవనెత్తాయి. మొత్తం 6 ప్రధాన సంఘటనల్లో 234 మంది మరణించడం తీవ్ర Read more

Chiranjeevi : సునీత రాకపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
Chiranjeevi: సునీత రాకపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

రోదసి నుంచి భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ అంతరిక్షయాత్రికురాలు సునీతా విలియమ్స్, వ్యోమగామి బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు 9 నెలల పాటు అంతరిక్షంలో Read more

ఏడుగురి ప్రయాణికులను కాల్చి చంపిన పాక్ దుండగులు
ఏడుగురి ప్రయాణికులను కాల్చి చంపిన పాక్ దుండగులు

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌కు వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి ఏడుగురు ప్రయాణికులను హతమార్చారు. ఈ Read more

వ్యవసాయ రంగంలోనూ AI ప్రభావం: సత్య నాదెళ్ల
వ్యవసాయ రంగంలోనూ AI ప్రభావం: సత్య నాదెళ్ల

వ్యవసాయంపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అద్భుతంగా ఉందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. మహారాష్ట్రలోని బారామతిలో ఒక చిన్న పొలం దిగుబడిని పెంచడానికి AI Read more