हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

RBI Imposes Penalty: బ్యాంకులపై ఆర్బీఐ కొరడా

Vanipushpa
RBI Imposes Penalty: బ్యాంకులపై ఆర్బీఐ కొరడా

నిబంధనలను పాటించని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జరిమానా విధిస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఆర్‌బిఐ ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌లపై పెనాల్టీ విధించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను పాటించనందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ సహా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) లపై కొరడా ఝుళిపించింది. అయితే బ్యాంకుల కొన్ని లోపాల కారణంగానే ఈ జరిమానాలు విధించినట్లు ఆర్‌బిఐ తెలిపింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ పై రూ.61.4 లక్షల జరిమానా
కోటక్ మహీంద్రా బ్యాంక్‌ పై ఆర్‌బిఐ రూ.61.4 లక్షల జరిమానా విధించింది. ‘బ్యాంక్ క్రెడిట్ డెలివరీ కోసం లోన్ వ్యవస్థపై మార్గదర్శకాలు’ ఇంకా ‘రుణాలు & అడ్వాన్సులు – చట్టబద్ధమైన అలాగే ఇతర పరిమితులు’ వంటి నియమాలను బ్యాంక్ పాటించనందున ఈ జరిమానా పడింది. ఈ జరిమానా కేవలం నిబంధనలు లేకపోవడం వల్లనే విధించబడిందని, బ్యాంకు కస్టమర్‌ ట్రాన్సక్షన్ లేదా ఇతర వాటికీ సంబంధించి కాదని ఆర్‌బిఐ తెలిపింది.

బ్యాంకులపై ఆర్బీఐ కొరడా

HDFC ఫస్ట్ బ్యాంక్‌పై రూ.38.6 లక్షల జరిమానా
ఇక ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ రూ.38.6 లక్షల జరిమానా విధించింది . ‘KNOW YOUR CUSTOMER (KYC)’ నియమాలను పాటించనందుకు ఈ జరిమానా పడింది. కస్టమర్ల గుర్తింపు ఇంకా వారి ట్రాన్సక్షన్స్ వెరిఫై చేయడానికి KYC నియమాలు ముఖ్యమైనవి. అందుకే ఈ జరిమానా పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) పై రూ.29.6 లక్షల జరిమానా : పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) పై RBI రూ.29.6 లక్షల జరిమానా విధించింది . ‘బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్’కు సంబంధించిన నియమాలను పాటించనందుకు ఈ జరిమానా విధించింది. బ్యాంకులు కస్టమర్లకు మెరుగైన అలాగే పారదర్శక సేవలను అందించేలా కస్టమర్ సర్వీస్ నియమాలు నిర్ధారిస్తాయి. ఈ జరిమానా కూడా నియమాలు పాటించనందుకు మాత్రమే అని RBI స్పష్టం చేసింది.
నిబంధనలను పాటించడంలో బ్యాంకులు విఫలం
మొత్తంగా నిబంధనలను పాటించడంలో బ్యాంకులు విఫలమైనందున ఈ జరిమానాలు విధించడం జరిగిందని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది . బ్యాంకులు నియమాలను పాటించేలా ప్రోత్సహించడమే ఆర్‌బిఐ లక్ష్యం. ఈ జరిమానాలు బ్యాంకు ఇంకా కస్టమర్ల మధ్య ఏదైనా ట్రాన్సక్షన్ లేదా సంబంధిత విషయాలపై కాదని RBI క్లారిటీ ఇచ్చింది. కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే : నిబంధనలను పాటించనందుకు బ్యాంకులపై ఆర్‌బిఐ ఈ జరిమానా విధిస్తుంది. దీనికి బ్యాంకు కస్టమర్‌తో ఎలాంటి సంబంధం లేదు. అలాగే బ్యాంకింగ్ కార్యకలాపాలపై కూడా దీని ప్రభావం ఉండదు. బ్యాంకు ద్వారా కస్టమర్లకు అందిందిస్తున్న సేవలు ఎప్పటిలాగే నిరంతరం కొనసాగుతాయి.

Read Also: Infosys: ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయని 240 మందిని తొలగించిన ఇన్ఫోసిస్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870