మెగా అభిమానులంతా ఇప్పుడు రామ్ చరణ్ 16వ సినిమాపై కళ్లుపెట్టారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన నాటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ – సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాను సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మైసూర్, హైదరాబాద్‌లలో కొంతవరకూ చిత్రీకరణ పూర్తయింది. మాస్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సినిమా మరింత వేగంగా షూటింగ్ జరుపుకోనుంది.
టైటిల్ విషయంలో చరణ్ అసంతృప్తి?
మెగా అభిమానులను ఎంతగానో ఆకర్షించిన ‘పెద్ది’ టైటిల్‌పై ఇప్పుడు కొత్త చర్చలు మొదలయ్యాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాకు మొదటినుంచి ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసినప్పటికీ, హీరో రామ్ చరణ్ మాత్రం దీనిపై పూర్తిగా సంతృప్తిగా లేడని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అభిమానులు ఈ టైటిల్‌కు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినప్పటికీ, సినిమా కథకు మరింత పవర్‌ఫుల్, విభిన్నమైన టైటిల్ అవసరమనే ఆలోచనలో చరణ్ ఉన్నారని సమాచారం. దీనితో మూవీ టీమ్ ప్రస్తుతం కొత్త టైటిల్స్‌పై కసరత్తు చేస్తోందట. మరికొన్ని రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని అభిమానులు ఊహించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, టైటిల్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోవడంతో, టైటిల్ రివీల్ కాకుండా కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాలీవుడ్ లో ప్రచారం నడుస్తోంది.
చరణ్ బర్త్‌డేకు టైటిల్ రివీల్?
ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో, ఆ రోజున కొత్త టైటిల్‌తో పోస్టర్ రిలీజ్ చేయాలని అభిమానులు ఆశించారు. అయితే తాజా సమాచారం ప్రకారం, టైటిల్ నిర్ణయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, టైటిల్ లేకుండానే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
స్టార్ స్టడెడ్ క్యాస్ట్ – జాన్వీ, శివరాజ్ కుమార్, జగపతిబాబు
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇక కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరి పాత్రలు సినిమాకు హైలైట్ కానున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
రీసెంట్ షెడ్యూల్ అప్‌డేట్స్
ఈ సినిమా రీసెంట్‌గా మైసూర్‌లో ఒక కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అక్కడ కొన్ని ప్రధానమైన సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత టీమ్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
గ్రాండ్ రీల్ డేట్ – 2026 మార్చి 26
మెగా 16 సినిమా విడుదల తేదీ కూడా లాక్ అయింది. వచ్చే ఏడాది మార్చి 26న గ్రాండ్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ప్రామోషన్లు కూడా ఉండబోతున్నాయి.