గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో క్రేజీ బ్రాండ్ జట్టుకట్టాడు ఈసారి అతని స్టైల్, స్టార్ పవర్ రైట్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ శీతల పానీయాల బ్రాండ్ కాంపాకు దక్కింది. 2023 మార్చిలో మార్కెట్లోకి అడుగుపెట్టిన కాంపా డ్రింక్, చాలా తక్కువ సమయంలో మంచి మార్కెట్ సంపాదించుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ మద్దతుతో ఈ బ్రాండ్ మరింత ఊపు అందుకోనుంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. “కాంపా బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ ఎంపిక” అని చెప్పటమే కాదు, దీనిని ఒక పెద్ద మైలురాయిగా కూడా అభివర్ణించింది.

కాంపా బలంగా నిలబడే సమయంలో చరణ్ లాంటి స్టార్ కలవడం ద్వారా ప్రజల్లో మరింత నమ్మకాన్ని ఏర్పరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ భాగస్వామ్యంలో భాగంగా ప్రత్యేకమైన యాడ్‌ను కూడా రూపొందించారు.“కాంపా వాలీ జిద్ద్” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ యాడ్ ఫుల్ ఎనర్జీతో నిండినట్లు కనిపిస్తోంది. యూత్‌లో రామ్ చరణ్ క్రేజ్ ఎంతవేరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఈ యాడ్ కాంపాకు నెట్‌లోనూ, టీవీల్లోనూ, మొబైల్ స్క్రీన్‌లపైనూ భారీ ఎక్స్‌పోజర్ కలిగించనుంది.ఐపీఎల్ మాదిరిగా పెద్ద ఈవెంట్లలో ఈ యాడ్‌ను ప్రసారం చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.
క్రికెట్ సీజన్ హీట్‌లో శీతల పానీయాల డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి కాంపా బ్రాండ్ ఇది మంచి అవకాశంగా మార్చుకుంది.ఇక రామ్ చరణ్ గురించి చెప్పాలంటే, అతను కేవలం ఒక నటుడు మాత్రమే కాదు యూత్ ఐకాన్, స్టైల్ సింబల్, పాజిటివ్ ఎనర్జీ ప్రతీకగా నిలిచిపోయాడు.అతని స్టార్ పవర్‌ను ఉపయోగించుకోవాలనే ప్రయత్నంలో రిలయన్స్ సక్సెస్ అయిందనే చెప్పాలి.కాంపా డ్రింక్‌లు ఇప్పటికే యువతలో పాపులర్ అవుతున్న నేపథ్యంలో, రామ్ చరణ్ లాంటి పెద్ద సెలెబ్రిటీ చేరికతో ఈ బ్రాండ్ పేరు దేశవ్యాప్తంగా దూసుకెళ్లేలా కనిపిస్తోంది.ఈ భాగస్వామ్యం కాంపాకు మాత్రమే కాదు, రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి కూడా ఒక ఎగ్జయిటింగ్ అప్‌డేట్‌గానే నిలవనుంది.ఈ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్‌తో కాంపా తన మార్కెట్ షేర్ మరింతగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.రామ్ చరణ్ హవా కొనసాగుతుండగా, ఈ కొత్త కాంపా-చరణ్ కలయిక సమ్మర్ మార్కెట్‌లో హిట్టే అవుతుందనడంలో సందేహమే లేదు.