हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

Rajat Patidar: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్

Anusha
Rajat Patidar: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా,గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో(10 ఓవర్లు మిగిలుండగానే) పంజాబ్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది.ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్‌ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ(RCB) అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది. 9 ఏళ్ల తర్వాతా ఫైనల్ చేరిన ఆర్‌సీబీ 18 ఏళ్ల తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఊహించని ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మారో అవకాశం ఉంది. ఆర్‌సీబీ ఈ గెలుపుతో 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించింది. ఆర్‌సీబీ ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి. గతంలో 2009, 2011, 2016లో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ తృటిలో టైటిల్ చేజార్చుకుంది. 

తొలిసారిగా

ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యా‌టింగ్‌తో పాటు బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఈ సీజన్‌లో ఆర్సీబీ భవితవ్యం రజత్ పాటిదార్ చేతిలో ఉంది. రజత్ పాటిదార్(Rajat Patidar) ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు తొలి సీజన్‌లోనే రజత్ పాటిదార్ ఒక ప్రత్యేక ఘనతను సాధించాడు. దీనితో రజత్ పాటిదార్ ఇప్పుడు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల ప్రత్యేక క్లబ్‌లో చేరాడు.ఐపీఎల్‌లో తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తొలి సీజన్ లోనే ఆర్సీబీ జట్టును ఫైనల్స్‌కు నడిపించాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా తన కెరీర్‌లో అలాంటి ఘనత సాధించలేకపోయాడు. రజత్ పాటిదార్‌కు ముందు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, అనిల్ కుంబ్లే ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించారు.

Rajat Patidar: ఐపిఎల్  లో  చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్
Rajat Patidar: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన రజత్ పాటిదార్

ఇన్నింగ్స్

రజత్ పాటిదార్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత,ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని వల్ల ఆర్సీబీకి లాభం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 101 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ తరఫున మార్కస్ స్టొయినీస్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు. దీనితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(Prabhsimran Singh) 18 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ తలో 3 వికెట్లు పడగొట్టగా ఆర్సీబీ తరఫు యశ్ దయాల్ 2 వికెట్లు పడగొట్టాడు.దీని తర్వాత ఆర్సీబీ 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విఫలమైనా ఫిల్ సాల్ట్(Phill Salt) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫిల్ సాల్ట్ వేగంగా బ్యాటింగ్ చేస్తూ 27 బంతుల్లో 56 పరుగులు చేశాడు. దీనితో పాటు మయాంక్ అగర్వాల్ 19 పరుగులు, రజత్ పాటిదార్ 15 నాటౌట్‌గా నిలిచారు.

Read Also: Athletics Championships: అథ్లెటిక్స్‌ లో భారత్ పసిడి పథకాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870