IMD : ఈ సారి భారత్‌లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయం రంగం వాటా 18 శాతం ఉన్నందున.. ఇది రైతులకు శుభవార్త అని నిపుణులు అంటున్నారు.

ఈసారి 105 శాతం అధిక వర్షపాతం
జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుంది అని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మెహపాత్ర వెల్లడించారు. ఈ సారి ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు.. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా ఇటీవల తన నివేదికను విడుదల చేసింది.
దేశంలో సగటున 868.6 మి.మీ వర్షం
రాబోయే ‘నైరుతి’ సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. మార్చి వరకు వాతావరణ పరిస్థితులు, పలు అంశాలను విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మి.మీ వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్యలో వర్షాలు వేగం పుంజుకోనున్నాయని పేర్కొంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Read Also : ఢిల్లీలోని వాయు కాలుష్యంపై నితిన్ గడ్కరీ ఆందోళన