हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

Anusha
Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

తెలంగాణలో వర్షాలు మళ్ళీ తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతోంది.భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.రేపు (జూలై 4) కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపు జల్లులు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది.

వర్షాలు కురిసే అవకాశం ఉంది

రుతుపవన ద్రోణి ప్రస్తుతం చురుకుగా ఉన్నందున రాబోయే 24 నుండి 48 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు (Officers) సూచించారు. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలని కోరారు.తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మళ్ళీ పుంజుకుంటున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి దీనికి ప్రధాన కారణం. జూన్ నెలలో వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.

Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ
Rain: తెలంగాణకు రెయిన్ అలర్ట్..పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ

సాధారణం కంటే అధిక వర్షపాతం

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం జూలైలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలోని మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ (Telangana) లోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Breaking news: సనత్‌నగర్‌లో పేలిన రిఫ్రిజిరేటర్.. తప్పిన ప్రమాదం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870