kejrival rahul gandhi

కేజ్రీవాల్ కు రాహుల్ గాంధీ సవాల్

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు, ప్రధాని నరేంద్ర మోదీకి తేడా లేదని, ఇద్దరూ ఒకటేనని రాహుల్ ఆరోపించారు. ఇటు ఆప్ లో, అటు బీజేపీలో.. రెండు పార్టీలు కూడా దళితులను దూరం పెడుతున్నాయని, పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్క దళితుడికీ కూడా చోటు లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) లో చూసుకున్నట్లయితే కేజ్రీవాల్ సహా తొమ్మిది మంది పేర్లు మాత్రమే వినిపిస్తాయని, అందులో ఒక్కరు కూడా దళిత వర్గానికి చెందిన వారు లేరని విమర్శించారు. మోదీకి, కేజ్రీవాల్ కు మధ్య ఉన్న తేడా కేవలం ఒక్కటేనని, మోదీ ఓపెన్ గా మాట్లాడతారు కేజ్రీవాల్ మౌనంగా ఉంటారని చెప్పారు. అవసరమైన సందర్భాలలో కూడా కేజ్రీవాల్ బయటకు వచ్చి మాట్లాడరని రాహుల్ మండిపడ్డారు.

Advertisements
rahul gandhi

ఐదేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చి పదేళ్లు గడిచాయని చెప్పారు. యమునా నది శుద్ధి అయినట్లేనా అని ప్రశ్నించారు. దమ్ముంటే యమునా నది నీటిని తాగాలని కేజ్రీవాల్ కు సవాల్ విసిరారు. ఆయన నిజంగానే తాగితే తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తానని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఆ నీరు తాగితే ఆసుపత్రిలో చేరాల్సిందేననే చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఎస్ఎస్ భావజాలంతో ద్వేషాన్ని వెదజల్లే బీజేపీకి, ఐకమత్యంతో ప్రేమను పంచే కాంగ్రెస్ పార్టీకి మధ్య పోరు అని చెప్పారు. ప్రస్తుతం పదవిలో ఉన్నారు కాబట్టి మోదీ పేరు చాలాచోట్ల వినిపిస్తోందని, పదవి నుంచి దిగిపోయాక ఎవరూ ఆయనను తలుచుకోరని రాహుల్ చెప్పారు. మహాత్మా గాంధీ, గాడ్సేలలో ఎవరూ గాడ్సేను తలుచుకోరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Related Posts
Narendra Modi : రామసేతు దర్శన భాగ్యం కలిగింది: ప్రధాని మోదీ
Narendra Modi రామసేతు దర్శన భాగ్యం కలిగింది ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీలంక పర్యటనను ముగించుకొని భారతదేశానికి చేరుకున్నారు. అనంతరం, ఆయన తమిళనాడులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీలంక నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి Read more

Gold Price : ప్రతీకారం ఎఫెక్ట్..గోల్డ్ ప్రియులకు షాక్
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులు, వాణిజ్య యుద్ధాల ఉత్కంఠ నేపథ్యంలో బంగారం ధరలు చరిత్రలో తొలిసారిగా అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ Read more

సచిన్ టెండూల్కర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
సచిన్ టెండూల్కర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సచిన్ టెండూల్కర్ తాజాగా CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోనున్నారు. గత సంవత్సరం రవిశాస్త్రి మరియు ఫరోఖ్ ఇంజనీర్‌ల తర్వాత, ఈ శనివారం ఫిబ్రవరి 1న Read more

మూసీ వద్ద ఈటెల , కేసీఆర్ ప్లెక్సీలు
ktr etela

కాంగ్రెస్ ప్రభుత్వ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలు intensify అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల Read more

×