ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2024 టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ ఆసక్తికరంగా మారింది. పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటి వరకూ అగ్రస్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సిబి), గుజరాత్ టైటాన్స్ (జిటి) చేతిలో ఓడిపోయింది.దాంతో పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ రెండో స్థానాలు దిగజారి మూడోస్థానానికి చేరుకుంది. ఇక గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఇప్పటి వరకు రెండుమ్యాచుల్లో ఓటములు లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ-జీటీ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.
మూడో ప్లేస్
దాంతో అగ్రస్థానం నుంచి మూడో ప్లేస్‌కి చేరుకుంది ఆర్‌సీబీ. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన ఆర్‌సీబీ రెండు విజయాలతో నాలుగు పాయింట్లు ఉండగా రన్ రేట్ +1.149తో మూడో ప్లేస్లో నిలిచింది. గుజరాత్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో రెండు విజయాలు నమోదు చేసి.. నాలుగు పాయింట్లు, +0.807 రన్ రేట్ ఉన్నది. ఇక పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచుల్లో రెండు విజయాలతో ఆ జట్టు ఖాతాలు నాలుగు పాయింట్లు ఉండగా +1.485 రన్ రేట్ ఉన్నది. ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా+1.320 రన్‌రేట్‌తో రెండోస్థానంలో ఉన్నది.ఏప్రిల్ 2 వరకు జరిగిన మ్యాచుల తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. మూడు మ్యాచుల్లో 219.76 స్ట్రయిక్ రేట్‌తో 189 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు 17 ఫోర్లు, 15 సిక్సర్లు బాదాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 75. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ నిలిచాడు. మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 62 సగటు, 157.63 స్ట్రయిక్ రేట్‌తో 186 పరుగులు చేశాడు. ఉత్తమ బ్యాటింగ్ గణాంకాలు 41 బంతుల్లో 74 పరుగులు. ఆ తర్వాత గుజరాత్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ మూడోస్థానానికి చేరాడు. మూడు ఇన్నింగ్స్‌లో 83 సగటు, 172.92 స్ట్రయిక్ రేట్‌తో 166 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో 149 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 97 నాటౌట్.

నూర్ అహ్మద్
చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. నూర్ అద్భుతంగా బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. రెండవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. రెండు మ్యాచుల్లో ఎనిమిది వికెట్లు తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ ఐదు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన జోష్ హాజిల్‌వుడ్, గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఆర్ సాయి కిశోర్, సీఎస్‌కెకు చెందిన ఖలీల్ అహ్మద్, లక్నోకు చెందిన శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. ఈ నలుగురూ చెరో ఆరు వికెట్లు పడగొట్టారు.