ఐపీఎల్ 2025 సీజన్‌లో ముల్లాన్‌పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో పిచ్‌పై పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకుని 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా కేకేఆర్ 95 పరుగులకు ఆలౌట్ అయ్యింది.ఇరు జట్ల స్పిన్నర్లు వికెట్ల పండుగ చేసుకున్న పోరులో కింగ్స్ నిర్దేశించిన 112 పరుగుల స్వల్ప ఛేదనలో కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే చేతులెత్తేయడంతో పంజాబ్ 16 పరుగుల తేడాతో గెలిచింది.రఘువంశీ (28 బంతుల్లో 37, 5 ఫోర్లు, 1 సిక్స్), ఆండ్రీ రస్సెల్ (17) పోరాడారు. పంజాబ్ స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ (4/28), యాన్సెన్ (3/17) కేకేఆర్‌ను దెబ్బతీశారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్ (15 బంతుల్లో 30, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. హర్షిత్ రాణా (3/25) ఆరంభంలోనే కింగ్స్‌ను దెబ్బతీయగా మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (2/14), వరుణ్ చక్రవర్తి (2/21) కలిసి మిడిల్, లోయరార్డర్ పనిపట్టారు.
ఇంప్యాక్ట్
కేకేఆర్ కూడా 7 పరుగులకే ఓపెనర్లను కోల్పోవడంతో పంజాబ్‌లో ఆశలు రేగాయి. యాన్సెన్ తొలి ఓవర్లోనే నరైన్ (4)ను బౌల్డ్ చేయగా ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న బార్ట్‌లెట్ రెండో బంతికే డికాక్ (2)ను ఔట్ చేసి కోల్‌కతాకు షాకిచ్చాడు. కానీ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన రఘువంశీ కెప్టెన్ రహానేతో కలిసి కోల్‌కతాను ఆదుకున్నాడు. ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీగా మలిచిన అతడు కింగ్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. యాన్సెన్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టిన రఘువంశీ బార్ట్‌లెట్ ఆరో ఓవర్లో 6, 4తో రెచ్చిపోయాడు.

రికార్డ్
తాజా విజయంతో పంజాబ్ కింగ్స్ 16 ఏళ్ల ఐపీఎల్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ జట్టుగా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న రికార్డ్‌ను అధిగమించింది. 2009లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 116/9 స్కోర్‌ను అధిగమించింది.111 – పీబీకేఎస్ వర్సెస్ కేకేఆర్, ముల్లాన్‌పూర్, 2025,116/9 – సీఎస్‌కే వర్సెస్ పీబీకేఎస్, డర్బన్, 2009,118 – ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ ఎంఐ, ముంబై వాంఖడే, 2018,119/8 – పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ, డర్బన్, 2009,119/8 – ఎస్‌ఆర్‌హెచ్ వర్సెస్ పీడబ్ల్యూఐ, పూణే, 2013,గతేడాది కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్ 262 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక రన్ ఛేజ్‌గా నిలిచింది.
Read Also: IPL 2025: కెకెఆర్ ఔట్ పై స్పందించిన కెప్టెన్ అజింక్యా రహానే