ప్రయాగ్‌రాజ్ ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాకుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి అనేక మంది ఇక్కడ చేరుకున్నారు. వసంత పంచమి రోజున రద్దీ ఇంకా కొనసాగుతోంది ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుకలో భారత ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి మోదీ ఫిబ్రవరి 5న త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి వస్తారని వెల్లడైంది. ఉదయం 10 గంటలకు ఆయన ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు తరువాత 10:45 గంటలకు అరైల్ ఘాట్‌కు చేరుకుని అక్కడి నుండి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా ప్రాంతానికి చేరుకుంటారు. అప్పుడు 11 నుండి 11:30 గంటల మధ్య మోదీ గంగానది పరిధిలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయనున్నారు.

స్నానాన్ని పూర్తి చేసిన తరువాత, 11:45 గంటలకు ఆయన బోటు ద్వారా తిరిగి అరైల్ ఘాట్ చేరుకుంటారు. అక్కడి నుండి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని న్యూఢిల్లీకి తిరిగి వెళ్లే అవకాశం ఉంది.ప్రయాగ్‌రాజ్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి ఇతర కార్యాలయాలలో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం పుణ్యస్నానం చేసి, గంగానదికి పూజలు అర్పించి తిరిగి వెళ్లిపోతారు. ఈ మొత్తం పర్యటనలో మోదీ ఒక గంటకంటే ఎక్కువ సమయం గడపనున్నారు.ప్రధానమంత్రి మోదీ ప్రయాగ్‌రాజ్ పర్యటన సందర్భంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం. మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ఆయన అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.5500 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టబడ్డాయి.ఇక మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది.