Narendra Modi: ఈ నెల 24న బీహార్‌ పర్యటనకు ప్రధాని మోదీ

Narendra Modi: ఏప్రిల్ 24న బీహార్‌ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 24న బీహార్‌కు పర్యటనకు వస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సీఎం అభ్యర్ధిగా నితీష్‌ కుమార్ పేరు ప్రకటిస్తారా? లేక సస్పెన్స్‌ కొనసాగిస్తారా? నితీష్‌ రాజకీయ జీవితం ముగిసిందని విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో మోదీ ఏం చెబుతారన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు ఇప్పటికే బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏప్రిల్ 24న బీహార్‌కు వస్తున్నారు. మధుబనిలోని భౌదాగరి వద్ద ఉన్న విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు, అనేక ముఖ్య పథకాలను ప్రకటించనున్నారు. దాదాపు 2 నెలల్లో ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటించడం ఇది రెండవసారి.బీహార్‌లో మరోసారి ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే తమిళనాడులో పళనిస్వామి నేతృత్వం లోనే ఎన్నికల్లో పోటీ చేస్తామన్న బీజేపీ నాయకత్వం బీహార్‌ విషయంలో ఎలాంటి ప్రకటన చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ను మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తారా? లేక ఎన్నికల తరువాతే సీఎంని నిర్ణయిస్తామని అంటారా? ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Advertisements

అసెంబ్లీ ఎన్నికల 

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. రాహుల్‌ డైరెక్షన్‌ను బీహార్‌ కాంగ్రెస్‌ కూడా పోరుబాట పట్టింది. నిరుద్యోగులకు న్యాయం పేరుతో భారీ ఆందోళనలు చేపట్టింది. దీంతో విపక్షాలకు మోదీ ఎలా కౌంటర్‌ ఇస్తారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.అయితే మోదీ బీహార్‌ పర్యటనలో సీఎం అభ్యర్ధిపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. మోదీ పర్యటనపై ఏర్పాట్ల కోసం ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం పాట్నాలో జరిగింది. నితీష్‌ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు బీహార్‌ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. వికసిత్‌ బీహార్‌ ఎన్డీఏ తోనే సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగాల విషయంలో విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. నితీష్‌కుమార్‌ ఐదేళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నితీష్‌ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతోంది. ఎన్డీఏ పాలనలో బీహార్‌ దూసుకెళ్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించామని సామ్రాట్ చౌదరి తెలిపారు. 2030లో వికసిత్‌ బీహార్‌ లక్ష్యంగా ఎన్డీఏనే గెలిపించాలని ఆయన అన్నారు.

 
Narendra Modi: ఈ నెల 24న బీహార్‌ పర్యటనకు ప్రధాని మోదీ

బీహార్‌లో పర్యటన

బీహార్‌ ఎన్డీఏ కూటమి సమావేశానికి బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ కీలక నేతలు హాజరయ్యారు. మధుబనిలో మోదీ మీటింగ్‌ను సక్సెస్‌ చేస్తామన్నారు ఎంపీ శాంభవి చౌదరి. ప్రధాని తొలిసారి బీహార్‌కు రావడం లేదు. బీహార్‌కు ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో భాగల్పూరు వచ్చారు. ఇప్పుడు మధుబని వస్తున్నారు. ఆయన సభను సక్సెస్‌ చేయడానికి ఎన్డీఏ పార్టీల సమావేశం జరిగిందని ఎంపీ శాంభవి చౌదరి స్పష్టం చేశారు.

Read Also: Tahawwur Rana : తహవూర్ రాణా అడిగిన వస్తువులు ఇవే..

Related Posts
E-Pass: ఊటీ, కొడైకెనాల్‌లో అమలులోకి ఈ-పాస్‌ విధానం
E-Pass: ఊటీ, కొడైకెనాల్‌లో అమలులోకి ఈ-పాస్‌ విధానం

ఈ-పాస్ విధానం అమల్లోకి తమిళనాడు ప్రభుత్వం వేసవి కాలంలో ఊటీ, కొడైకెనాల్‌లో వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల మేరకు Read more

ముంబై దాడులు: రాణా అప్పగింతకు US సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
mumbai attack

2008 ముంబై దాడుల కేసులో ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాణా అప్పగింతపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను Read more

హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినం
హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అన్ని రూల్స్ మారిపోతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్న ట్రంప్ సర్కార్.. మరింత Read more

నాగ పౌర్ణమి సందర్బంగా కోట్ల మంది భక్తులు
నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

మహా కుంభ మేళా 2025 వైభవంగా కొనసాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న కోట్లాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వద్ద Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×