ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందన

ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందన

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు వెలువరించిన తీర్పుపై తండ్రి బాలస్వామి స్పందించారు. ప్రణయ్ హత్య కేసులో ఏ2 నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్షను, మిగిలిన నిందితులకు జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు.

ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందన

నేరస్తులకు కనువిప్పు

ఈ తీర్పుతో నేరస్తులకు కనువిప్పు కలగాలని అన్నారు. ప్రణయ్ హత్యతో తాము చాలా కోల్పోయామని, ఇలాంటి హత్యలు జరగడం విచారకరమని అన్నారు. ఈ తీర్పుతో అయినా పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. తన కొడుకు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరిది కావాలని కోరుకుంటూ ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట పోరాటం చేశామని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత కూడా పలు హత్యలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాన్ని పట్టుకొని వేలాడే వారికి, కుల దురహంకారంతో కూతుళ్లను చంపుకునే వారికి ఈ తీర్పు కనువిప్పు కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ప్రణయ్ హత్యతో తమకు కొడుకు లేకుండా, అమృతకు భర్త లేకుండా పోయాడని, మారుతిరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు.

ఏడుగురు నేరస్తులకు జైలుశిక్ష

ఈ కేసులోని ఏడుగురు నేరస్తులకు జైలుశిక్ష పడిందని, వీరికి శిక్షపడినందుకు వారి కుటుంబాలు కూడా బాధపడుతూనే ఉంటాయని, కాబట్టి సుపారి తీసుకొని హత్యలు చేసే వారికి ఇది ఒక కనువిప్పు కావాలని ఆయన అన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకొని, పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించారు. కానీ హత్యలు సరికాదని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న తమను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేసినప్పటికీ తలొగ్గలేదని అన్నారు. ఈ కేసు విచారణ ఆలస్యమవుతుందని చాలామంది అనుమానం వ్యక్తం చేశారని, కానీ పోలీసులు పకడ్బందీగా ఛార్జిషీట్ దాఖలు చేశారని కొనియాడారు. ఈ కేసులో న్యాయం జరగడానికి నాటి ఎస్పీ రంగనాథ్ కూడా సహకరించారని అన్నారు. ఈరోజు వచ్చిన తీర్పుతో న్యాయం జరిగిందని అన్నారు. మీకు న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందా? అని అందరూ అడుగుతున్నారని, కానీ కొడుకులేని లోటును ఎవరూ తీర్చలేరని కంటతడి పెట్టారు.

Related Posts
నేను దేశం వదిలి పారిపోవడం లేదు – సజ్జల
sajjala

వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి మంగ‌ళ‌గిరి పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులో పేర్కొన్న Read more

యూఏఈలో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష
యూఏఈలో ఇద్దరు భారతీయులకు ఉరిశిక్ష – భారత విదేశాంగ శాఖ ప్రకటన

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారతీయులకు ఉరిశిక్ష అమలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. భారత విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కేరళకు చెందిన Read more

మస్తాన్ సాయి కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు

యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టయిన ముస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. మస్తాన్ సాయి , Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ కొత్త ఫార్ములా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ కొత్త ఫార్ములా

తెలంగాణలో కొత్తగా ఐదుగురికి ఎమ్మెల్సీగా అవకాశం లభించనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల Read more