ప్రముఖ బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రస్తుతం జాట్ సినిమాలో నటిస్తున్నారు, ‘గదర్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత, వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘బోర్డర్ 2’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన,జాట్ సినిమాతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వబోతున్నాడు.ఈ చిత్రానికి క్రాక్, వీరా సింహ రెడ్డి చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు.గోపిచంద్ మలినేని గతంలో ‘క్రాక్’, ‘వీర సింహా రెడ్డి’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈసారి బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్‌తో జత కట్టాడు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్‌తో పాటు కొన్ని పాటలు విడుదల కాగా,వాటికి మంచి స్పందన లభించింది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.‘జాట్’ మూవీ ఈ నెల 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ సన్నీ డియోల్ మరోసారి తన యాక్షన్ పంజా పవర్ ఏమిటో చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించడంతో, ఇటు టాలీవుడ్‌లోనూ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
సంతోషం వ్యక్తం
ఈ మూవీని ప్రేక్షకుల్లోకి మరింత దగ్గరగగా తీసుకెళ్లేందుకు ఈ చిత్ర యూనిట్‌కు తన టైమ్ కేటాయించాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తాజాగా జాట్ టీమ్ ప్రభాస్‌ను కలిసింది. సన్నీ డియోల్‌తో పాటు గోపీచంద్ మలినేని ప్రభాస్‌ను కలిసిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ‘జాట్’ కోసం ప్రభాస్ తనదైన సపోర్ట్ ఇస్తున్నాడని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.జాట్ చిత్రాన్ని పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందించగా.ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా, రెజీనా కాసాండ్ర, సయ్యామీ ఖేర్, వినీత్ కుమార్ సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
స్పష్టంగా
సన్నీ డియోల్, టాలీవుడ్ సినిమా తీరుతెన్నులు, నిర్మాణ విధానంపై ప్రశంసలు కురిపించారు.టాలీవుడ్ నిర్మాతల నుంచి బాలీవుడ్ నిర్మాతలు ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అన్నారు.దక్షిణాదిలో నటీనటులకు గౌరవం ఎక్కువ, వారి అభిప్రాయాలను స్పష్టంగా వినిపించే తత్వం ఉంది, ఇది బాలీవుడ్‌లో కనిపించడం లేదని చెప్పారు.సినిమా నిర్మాణంలో స్పష్టత, కథాపరమైన నిబద్ధత, టాలీవుడ్ చిత్రాలను ప్రత్యేకంగా నిలిపే అంశాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: Ramba: తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న రంభ