Police counter on bail petition in phone tapping case

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్పై పోలీసుల కౌంటర్

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్‌రావే కీలకమని కౌంటర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. ఎస్‌ఐబీలో ఎస్‌వోటీని నెలకొల్పింది ఇతనేనని, ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోనే ఇది పనిచేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు.

Advertisements
ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్

తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు

ఫోన్‌ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా ఓఎస్‌డీ విధులు నిర్వహించిందని, ట్యాపింగ్‌ బాధితుల్లో ప్రతిపక్షాలను, కొందరు అధికారులను, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారని పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) తన వాదనలు వినిపించారు. ఓఎస్‌డీగా ఇతర అధికారులకు తప్పుడు డాక్యుమెంట్లతో ప్రమోషన్లు చేసిన ప్రభాకర్ రావు ఐపీఎస్‌ అధికారిగా విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తునకు సహకరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఏప్రిల్ 15వ తేదీకి తీర్పు వాయిదా

ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయడంతో విధిలేక ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించాడని, హైదరాబాద్‌ వస్తున్నానని గతంలో ట్రయల్‌ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారని, దాదాపు తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకూ ఇండియాకు రాలేదని పీపీ గుర్తుచేశారు. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయాలని వాదించిన పీపీ.. పోలీస్‌ దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ కేసులో విచారణను కోర్టు ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసింది.

Read Also : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసు..నేడు హైకోర్టు తీర్పు

Related Posts
అమెరికా యుద్ధాన్ని కోరుకుంటే యుద్ధమే ఇస్తాం: చైనా
12 మంది చైనా హ్యాకర్లపై అమెరికా క్రిమినల్ అభియోగాలు

బీజీంగ్‌: ఆసియా దిగ్గజం చైనాపై పరస్పర సుంకాలు విధిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేసారు. అమెరికా వాణిజ్య యుద్ధం చేయడానికి నిశ్చయించుకుంటే మేం మాత్రం ఎందుకు Read more

ప్రయాణికులకు ప్రైవేట్ బస్సుల షాక్
ప్రయాణికులకు ప్రైవేట్ బస్సుల షాక్

గత 20 రోజుల నుంచి ఫిట్‌నెస్ లేకుండా, నిబంధనలు పాటించకుండా, తెలంగాణ ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీయే అధికారులు స్పెషల్ డ్రైవ్ Read more

Iftar Dinner విజయవాడలో ఇఫ్తార్ విందు… హాజరైన సీఎం చంద్రబాబు
Iftar Dinner విజయవాడ

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం విజయవాడలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో Read more

నేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy will start Indiramma Houses today

మొదటి విడతలో 72,045 ఇళ్లకు శంకుస్థాపన హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈరోజు మరో అడుగు పడనుంది. జనవరి 26న తొలి విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×