కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. తొలుత ఆయనను విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే మరో వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి బయల్దేరారు. మార్గమధ్యంలో ఎస్కార్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అక్కడకు మరో పోలీస్ వాహనం వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులతో వల్లభనేని వంశీ వాగ్వాదానికి దిగారు. కాసేపు వాగ్వాదం అనంతరం పోలీసుల వాహనాలు బయల్దేరాయి. ఆయనను ఎక్కడకు తీసుకు వెళ్తున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ… ఆయనపై కేసు నమోదైన పటమట పీఎస్ కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. పటమట పీఎస్ వద్ద బందోబస్తును పెంచారు. తాడేపల్లి పీఎస్ కు కూడా తరలించే అవకాశం ఉంది.

వల్లభనేవి వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 144 సెక్షన్ తో పాటు, పోలీస్ యాక్ట్ 30ని విధించారు. నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మార్గమధ్యంలో హైడ్రామా – వాగ్వాదం
పోలీసులు ఎస్కార్ట్ వాహనాన్ని ఆపి, మరో వాహనంలోకి మార్చే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో వల్లభనేని వంశీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
కొంత సేపటి తర్వాత వాహనాలు మళ్లీ బయలుదేరాయి.
వంశీని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే?
అధికారిక క్లారిటీ లేకపోయినా, వంశీని పటమట పోలీస్ స్టేషన్‌కి తరలించే అవకాశం ఉంది.
పటమట పీఎస్ వద్ద బందోబస్తు పెంచారు. అలాగే తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.