pm modi reviews the situation on Kumbh Mela

కుంభ‌మేళాపై ప‌రిస్థితి పై ప్రధాని స‌మీక్ష..

న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ సంగం తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌనీ అమావాస్య సందర్భంగా స్నానం ఆచరించేందుకు మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయపడినట్లు సమాచారం. అయితే ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడీ కుంభ‌మేళాపై ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

ప్ర‌ధాని మోడీ మ‌హాకుంభ్ ప‌రిస్థితిపై యూపీ సీఎం యోగితో ఇవాళ మాట్లాడారు. ఇప్ప‌టికే మూడు సార్లు మాట్లాడిన అక్క‌డి ప‌రిస్థితుల‌ను తెలుసుకున్నారు. కుంభ‌మేళా ప‌రిస్థితి పై ప్ర‌ధాని మోడీస‌మీక్షిస్తూనే ఉన్నారు. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని ఆదేశించారు. యూపీ ప్ర‌భుత్వ అధికారుల‌తో ఆయ‌న ట‌చ్‌లోనే ఉన్నారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల్ని ఆయ‌న సూచిస్తున్నారు.

image

తొక్కిస‌లాట వ‌ల్ల 13 అకాడాలు అమృత స్నానం ర‌ద్దు చేసుకున్నాయి. ఈ నేప‌థ్యంలో వాళ్లు ప్ర‌క‌ట‌న జారీ చేశారు. అయితే ఇవాళ ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత అకాడాలు అమృత స్నానానికి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా యూపీ సీఎంతో ప‌రిస్థితి గురించి తెలుసుకున్నారు.

త్రివేణి సంగ‌మంలో తొక్కిస‌లాట జ‌రిగిన ప్ర‌దేశానికి ఉద‌యం సుమారు 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు మూడు గంట‌ల పాటు త‌ర‌లింపు ప్ర‌క్రియ జ‌రిగింది. అమావాస్య రోజున స్నానం చేయాల‌న్న ఉద్దేశంతో.. కోట్ల సంఖ్య‌లో భ‌క్తులు ప్ర‌యాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. అధికారులు అంచ‌నా ప్ర‌కారం.. ఇప్ప‌టికే 5 కోట్ల మంది ప్ర‌యాగ్‌రాజ్ ప‌రిస‌రాల్లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీనికి తోడు సాయంత్రం వ‌ర‌కు ఆ సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.

Related Posts
క్షమాపణలు చెప్పిన సీవీ ఆనంద్‌
Allu Arjun Controversy Hyderabad Commissioner CV Anand Apologies

హైదరాబాద్‌: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. అల్లు అర్జున్, సంధ్య థియేటర్‌దే Read more

Russia-Ukraine War : నల్ల సముద్రం ఒప్పందంపై చర్చలు : ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం
Russia Ukraine War నల్ల సముద్రం ఒప్పందంపై చర్చలు ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం

Russia-Ukraine War : నల్ల సముద్రం ఒప్పందంపై చర్చలు : ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం నల్ల సముద్రం ఒప్పందం గురించి మీకు తెలుసా రష్యా, ఉక్రెయిన్ Read more

తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
Threats to blow up Telangana Secretariat

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా Read more

తెలంగాణలో మూడు రోజులపాటు వైన్స్ బంద్ !
wine shops telangana

తెలంగాణలో మద్యం ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు Read more