వచ్చే వారం పీఎం కిసాన్ డబ్బులు విడుదల

వచ్చే వారం పీఎం కిసాన్ డబ్బులు విడుదల

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 19వ విడత డబ్బు విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. ప్రధాని మోదీ దేశంలోని రైతుల ప్రజలకు సహాయం కోసం వాస్తవానికి దీనిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
24న బీహార్‌లోని భాగల్పూర్ నుంచి విడుదల
వచ్చే వారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్‌లోని భాగల్పూర్ నుంచి నిధులను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఏటా రూ.6,000 డీబీటీ బెనిఫిట్ కింద నేరుగా ఖాతాలో జమచేస్తున్న సంగతి తెలిసిందే. దీనికింద దేశంలోని అర్హులైన రైతులందరికీ ప్రతి 4 నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు దఫాలుగా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ నిధులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా బ్యాంక్ అకౌంట్లలోకి జమచేయబడుతున్న సంగతి తెలిసిందే.

వచ్చే వారం పీఎం కిసాన్ డబ్బులు విడుదల


రైతులకు eKYC తప్పనిసరి
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమచేయబడతారు. పీఎం కిసాన్ లో నమోదైన రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించటం ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. స్కీమ్ బెనిఫిట్స్ పొందటానికి సదరు వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. తక్కువ భూమి కలిగిన రైతై ఉండాలి. నెలకు పెన్షన్ రూపంలో రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉండకూడదు.
రైతుల ఆధార్ కార్డు తప్పనిసరి
పిఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తాన్ని అందుకోవడానికి లబ్దిదారుడు రైతుల ఆధార్ కార్డు తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడి ఉండాలి. ఈ పథకాన్ని పొందేందుకు eKYC, యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అవసరం. ఈ ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. జాబితాలోని పేరును తనిఖీ చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో ‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను పూరించి రిపోర్ట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.

Related Posts
IMD : ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు అధిక ఉష్ణోగ్ర‌త‌లు: ఐఎండీ
High temperatures from April to June: IMD

IMD : ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా సాధార‌ణం కంటే అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ ఈరోజుహెచ్చ‌రిక చేసింది. మ‌ధ్య‌, తూర్పు, Read more

ఉత్తరప్రదేశ్‌ ఉపఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
UP by elections. First list of BJP candidates released

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని 9 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీజేపీ నేడు (గురువారం) విడుదల చేసింది. రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్‌లో జరిగే Read more

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్
rahulgandhi

న్యూఢిల్లీ :పార్లమెంట్ ఆవరణలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తమపై దాడికి పాల్పడ్డారంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ Read more

బిర్యానీ తెచ్చిన తంట 8 లక్షలు ఖర్చు ఎక్కడంటే?
గొంతులో ఇరుక్కున్న ఎముక 8 లక్షల బిల్లుషాక్ లో కుటుంబం

ఆహారం తినడం ఒక ఆనందకరమైన భాగం. అయితే, కొన్ని సందర్భాల్లో చిన్న అపశృతి కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముంబైకి చెందిన ఓ మహిళకు రెస్టారెంట్‌లో Read more