ఆరోగ్యంపై ప్రజల్లో వేగంగా పెరుగుతున్న శ్రద్ధతో, వంటగదుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టేబుల్ సాల్ట్ బదులుగా హిమాలయన్ పింక్ సాల్ట్ (Pink Salt), సీ సాల్ట్ వాడకం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే దీనిపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పింక్ సాల్ట్ సహజంగా లభిస్తుందని, రసాయనాలు ఉండవని చెప్పుకుంటూ చాలామంది దీన్ని వాడుతున్నారు. కానీ ఇందులో శరీరానికి అత్యంత కీలకమైన అయోడిన్ మోతాదు చాలా తక్కువ. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు (Doctors say it is dangerous to health) హెచ్చరిస్తున్నారు.

థైరాయిడ్ హార్మోన్లకు అయోడిన్ ఎంతో అవసరం
శరీరంలో జీవక్రియల నియంత్రణకు, మెదడు అభివృద్ధికి థైరాయిడ్ హార్మోన్లు అవసరం. వాటి ఉత్పత్తికి అయోడిన్ కీలకం. గర్భిణులు, పిల్లలు దీనిపై మరింత అవగాహనతో ఉండాలి. అయోడైజ్డ్ ఉప్పే శరీరానికి అవసరమైన అయోడిన్‌ను అందించగలదు.భారత్‌లో 1960ల నుంచే గాయిటర్ వంటి వ్యాధులను నివారించేందుకు అయోడైజ్డ్ ఉప్పు వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడీ ట్రెండ్ మూలంగా మళ్లీ అదే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
WHO హెచ్చరిక ఇదే!
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అయోడిన్ పౌష్టికతపై నిరంతరం హెచ్చరిస్తోంది. ఫ్యాషన్ కోసం ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టొద్దని సూచిస్తోంది. వాస్తవానికి హిమాలయన్ సాల్ట్ మినరల్స్ కలిగి ఉన్నా, అవి శరీర అవసరాలకు సరిపోవు. ముఖ్యమైనది అయోడిన్‌నే.నిపుణుల స్పష్టమైన సూచన ఏంటంటే, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టేబుల్ ఉప్పును వాడాలన్నదే. రోజువారీ వంటల్లో తప్పనిసరిగా అయోడైజ్డ్ సాల్ట్‌ను వినియోగించాలని కోరుతున్నారు. ఆరోగ్యమే లక్ష్యమైతే, శాస్త్రీయంగా పరిశీలించిన వాస్తవాలను అనుసరించాల్సిందే.
Read Also : F-35B Fighter Jet : ఎట్టకేలకు టార్మాక్ నుంచి హ్యాంగర్‌లోకి తరలింపు