జమ్మూకశ్మీర్‌లో చినాబ్ రైల్వే బ్రిడ్జి(Chenab Bridge)ని జూన్ 6న ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు ప్రధాని మోదీ(Prime Minister Modi). ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్ల ఎత్తు ఉంటుంది. ఇక ప్యారిస్‌లోని ప్రపంచ వింత అయిన ఈఫిల్ టవర్‌ను కూడా తలదన్నేలా ఈ చినాబ్ రైల్వే వంతెన ఉంటుంది. చినాబ్ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంతో…దేశానికి కశ్మీర్‌తో మరింత దృఢమైన బంధాన్ని ఏర్పరచింది ఇండియన్ రైల్వేస్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్ బ్రిడ్జ్. కుతుబ్ మినార్ ఎత్తు 72 మీటర్లు, ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు ఉంటే, రివర్ బెడ్ నుంచి చినాబ్ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు ఉంటుంది.







