తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒక వైపు చారిత్రక కట్టడాలు, మట్టుకు మించిన సాంకేతిక అభివృద్ధితో ప్రసిద్ధి చెందగా, మరోవైపు ప్రకృతికి దగ్గరగా ఉండాలనుకునే వారికి సరైన ఆప్షన్లు అందిస్తోంది. నగర శబ్దాల నుంచి కొంత తీరుకొని, సహజ శాంతిని ఆస్వాదించాలనుకునే వారు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న సరస్సులను (Lakes) సందర్శించవచ్చు.ఈ సరస్సులు పిక్నిక్, ఫోటోగ్రఫీ, బోటింగ్ వంటి అనేక వినోద కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటాయి. ఇవే కాకుండా, కొన్ని సరస్సులు చరిత్రకూ పూర్వపు గర్వకారక నిర్మాణాలకూ నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రోజు మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 5 ఉత్తమ సరస్సుల గురించి తెలుసుకుందాం.
హుస్సేన్ సాగర్ సరస్సు (Hussain Sagar Lake)
ప్రపంచంలోనే అతిపెద్ద మానవనిర్మిత సరస్సుల్లో ఒకటి.1563లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో హైదరాబాద్ ప్రసిద్ధ సరస్సులలో ఒకటైన హుస్సేన్ సాగర్ (Hussain Sagar) నిర్మించబడింది. ఈ సరస్సు 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జిబ్రాల్టర్ రాక్‌పై ఉన్న బుద్ధ విగ్రహం చూడటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సరస్సును సందర్శిస్తారు.

దుర్గం చెరువు (Durgam Cheruvu)
ఐటీ ఉద్యోగులకు దగ్గరలోనే ప్రశాంతమైన సరస్సు.దీనిని సీక్రెట్ లేక్ అని పిలువబడే దుర్గం చెరువు హైదరాబాద్ ఐటీ హబ్ (Hyderabad IT Hub) లోపల ఉంది. ఇక్కడ ఇది రాతి కొండలు, సహజ వృక్షసంపద మధ్య విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకప్పుడు నీటిపారుదల అవసరాలను తీర్చిన స్థలం ఇది. తర్వాత ఇది వారాంతపు ఆకర్షణగా మారింది.

షామీర్ పేట్ చెరువు (Shamirpet Lake)
పిక్నిక్‌కు,బర్డ్ వాచ్‌కు మంచి ప్రదేశం,షామీర్‌పేట్ సరస్సు విశాలమైన నీటి విస్తీర్ణంతో ఆకట్టుకుంటుంది. చుట్టూ అడవులు ఉండటం వల్ల అనేక రకాల పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. సెలవుదినాల్లో కుటుంబ పిక్నిక్‌లకు ఉత్తమ స్థలంగా నిలుస్తుంది.హైదరాబాద్ నగరం నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మృగవాణి జాతీయ ఉద్యానవనం (Mrugawani National Park)లో భాగంగా షామిర్‌పేట్ సరస్సు ఉంది. ఈ సరస్సు చుట్టూ ఉన్న ఆకురాల్చే చెట్ల ఆకట్టుకుంటాయి.

హిమాయత్ సాగర్ (Himayat Sagar)
ఆనందభరిత దృశ్యాలు, బైక్ రైడింగ్‌కు అనువైన మార్గాలు,హిమాయత్ సాగర్ సరస్సు నిజాం పాలనలో తాగునీటి కోసం నిర్మించబడింది.దీనికి హైదరాబాద్ చివరి నిజాం కుమారుడు ప్రిన్స్ హిమాయత్ అలీ ఖాన్ పేరు పెట్టారు. నేడు ఇది పర్యాటకులకు ఉత్తమ విశ్రాంతి ప్రదేశంగా మారింది. సాయంత్రం వేళ నీలి ఆకాశంలో పడుతున్న సూర్యాస్తమయం ఇక్కడ చూడాల్సిన ముఖ్యమైన దృశ్యం.ఇది ఉస్మాన్ సాగర్ (Osman Sagar) పక్కనే ఉంది. నగరం నీటి సరఫరా వ్యవస్థ 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన ఈ సరస్సుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

ఉస్మాన్ సాగర్ సరస్సు (Osman Sagar)
బ్రిటిష్ కాలంలో నీటి అవసరాల కోసం నిర్మించిన సరస్సు,ఇది నిజాం ఒస్మాన్ అలీ ఖాన్ పేరిట గండిపేట సరస్సుగా పిలువబడుతుంది. ఇక్కడ రోడ్ రైడింగ్, బోటింగ్ వంటి కార్యకలాపాలు ఉంటాయి. గండిపేట రిసార్ట్‌లు,పక్కనే ఉన్న రిసార్ట్ హౌసులు దీనిని ఆదివారం పర్యటనలకు కేంద్రంగా మారుస్తున్నాయి.నిజాం కాలంలో మానవ నిర్మిత జలాశయం ఉస్మాన్ సాగర్ అటవీ ప్రాంతంలో వాలుగా ఉన్న కొండలతో కూడి ఉంది. హైదరాబాద్ (Hyderabad) లోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ తాగునీటి సరఫరాను ఇక్కడ పొందుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, పక్షి పరిశీలకులు ఈ ప్రదేశంలో ఒక అద్భుతమైన అభయారణ్యాన్ని కనుగొనవచ్చు.

Read Also: PV Narasimha Rao: పీవీకి చంద్రబాబు, లోకేశ్ నివాళి