బాలీవుడ్లో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరోయిన్, నటనతో ప్రేక్షకుల మతిపోతున్నది.అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొతం. ఈ బ్యూటీ వారసత్వంగా చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ , తన నటనతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.ఇక తెలుగులో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు వెండితెరపైకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

ఈ మూవీలో సీత పాత్రలో కనిపించి అందరినీ మెప్పించింది. తన నటనతో ప్రతి ఒక్కరినీ కట్టి పడేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందానికి ఫిదా అవ్వని వారు లేరనే చెప్పాలి.

అయితే తెలుగులో తర్వాత కూడా చాలా సినిమాలు చేయాలనుకున్న అలియాకు ఆర్ ఆర్ ఆర్ తర్వాత నిరాశే దక్కిందని చెప్పాలి. ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్లో వరస ప్రాజెక్ట్స్ చేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ పండగ వేళ ట్రెడిషనల్ లుక్లో కనిపించి మెప్పించింది. చీరకట్టులో సింపుల్ లుక్లో తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.