हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Israel Iran: భయం నీడలో టెహ్రాన్ ప్రజలు- ఇంటర్నెట్ సర్వీసులు బంద్

Vanipushpa
Israel Iran: భయం నీడలో టెహ్రాన్ ప్రజలు- ఇంటర్నెట్ సర్వీసులు బంద్

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌(Tehran)ను ఇజ్రాయెల్, అమెరికా(Israel-America) లక్ష్యంగా చేసుకున్నాయి. నగరాన్ని వీడి వెళ్లిపోవాలని ఇప్పటికే అక్కడి ప్రజలకు అల్టిమేటం ఇచ్చాయి. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడులు తీవ్రరూపు దాల్చాయి. దీంతో టెహ్రాన్‌(Tehran)లోని ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణంలో ఎటువైపు ఇజ్రాయెల్ బాంబులు, డ్రోన్లు పడతాయో అర్థం కాక భయంభయంగా జీవిస్తున్నారు. ఇంటర్నెట్ సర్వీసుల(Internet Service)ను ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ఆపేసింది. ఫోన్ కాల్స్, మెసేజింగ్ సర్వీసులూ సక్రమంగా పనిచేయడం లేదు. అవి కూడా ఏ క్షణమైనా ఆగిపోవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వలస వెళ్లిపోయిన వేలాది మంది
ఇరాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వేచ్ఛగా తిరుగుతుండటం వల్ల టెహ్రాన్ ప్రజల టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో గత మూడు రోజుల వ్యవధిలో నగరం నుంచి వేలాది మంది వలస వెళ్లిపోయారు. వారంతా టెహ్రాన్ శివారు ప్రాంతాలు, కాస్పియన్ సముద్ర పరిసర ప్రాంతాలు, అర్మేనియా, తుర్కియే లకు తరలివెళ్లినట్లు తెలిసింది. మరెంతో మంది ప్రస్తుతం టెహ్రాన్​ను వీడి వెళ్తున్నారు. వీరి వాహనాల రద్దీతో నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్‌లే కనిపిస్తున్నాయి.

Israel Iran: భయం నీడలో టెహ్రాన్ ప్రజలు- ఇంటర్నెట్ సర్వీసులు బంద్
Israel Iran: భయం నీడలో టెహ్రాన్ ప్రజలు- ఇంటర్నెట్ సర్వీసులు బంద్

కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, మసీదులు
ఇప్పటికే టెహ్రాన్‌‌లోని చాలా ఏరియాలు ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రాణ భయం పట్టుకుంది. అయితే సొంత ఊరిని వదిలి వెళ్లేందుకు చాలామందికి మనసొప్పడం లేదు. అలాంటి వాళ్లంతా నగరంలోని మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, మసీదుల్లో తలదాచుకుంటున్నారు. ఎందుకంటే వీటినే ఇరాన్ ప్రభుత్వం షెల్టర్ జోన్లుగా ప్రకటించింది. ఇవన్నీ ప్రస్తుతం జనంతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి.
యుద్ధ ఘటనల కవరేజీని ఆపేసిన మీడియా సంస్థలు
1980వ దశకంలో ఇరాన్ – ఇరాక్ యుద్ధం జరిగే సమయానికి టెహ్రాన్​లోని దాదాపు ప్రతీ ఇంటిలో బేస్‌మెంట్ భాగం ఉండేది. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు వాటిలో దాచుకునేవారు. గత కొన్నేళ్లలో నగరంలో నిర్మితమైన కొత్తరకం భారీ భవనాల్లో బేస్‌మెంట్లు, షెల్టర్లు వంటి ఏర్పాట్లే లేవు. ఇజ్రాయెల్ తరహాలో ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా సురక్షిత షెల్టర్ జోన్లను నిర్మించలేదు. ప్రస్తుత యుద్ధంలో ఈ లోటు టెహ్రాన్ ప్రజలకు తెలిసొస్తోంది. 1980వ దశకంలో ఇరాన్ యుద్ధాలను ఎదుర్కొన్న సమయాల్లో టెహ్రాన్ పరిధిలో ఎయిర్ రైడ్ డ్రిల్స్ జరిగేవి.
రేపు బతికి ఉంటామో లేదో తెలియట్లేదు
‘టెహ్రాన్​లో ఇప్పుడు ఫోన్ కాల్స్ చేయడం, మెసేజ్‌లను పంపడం కూడా కష్టతరంగా మారింది. మేం చేసే కాల్స్, మెసేజ్‌లే చివరివి అవుతాయని అనిపిస్తోంది. ఫలితంగా మా కుటుంబీకులు, బంధువులతో మనసారా మాట్లాడుకోలేకపోతున్నాం. అసలు రేపు మేం బతికి ఉంటామో లేదో అర్థం కావడం లేదు. ఇప్పటికే చాలామంది వలస వెళ్లిపోయారు. నగరం వదిలి వెళ్లిపోవడం అనేది పరిష్కారం కాదని నా ఉద్దేశం.
టెహ్రాన్​ను వీడేందుకు సిద్ధమయ్యాం
ప్రజలు చనిపోతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం : టెహ్రాన్ వాస్తవ్యుడు
‘మా దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోవాలని మేం కోరుకోం. ఇరాన్‌లో ఏదైనా మార్పు వస్తే, ప్రజా ఉద్యమంతోనే రావాలి. అంతే తప్ప ఈవిధంగా దాడులతో కాదు. మా దేశంపై బాంబుల వర్షం కురుస్తుండటాన్ని, ప్రజలు చనిపోతుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం’ అని టెహ్రాన్ నగరాన్ని వదిలి మరో ప్రాంతానికి వెళ్లిపోయిన 29 ఏళ్ల యువకుడు చెప్పుకొచ్చాడు.

Read Also: Iran: ఇరాన్ లో అధికార మార్పుపై పెరుగుతున్న ఊహాగానాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

లైవ్‌ అప్‌డేట్స్ : గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

హిజ్బుల్లా నిరాయుధీకరణ: లెబనాన్ నిర్ణయానికి యూరోపియన్ యూనియన్ మద్దతు

హిజ్బుల్లా నిరాయుధీకరణ: లెబనాన్ నిర్ణయానికి యూరోపియన్ యూనియన్ మద్దతు

ఇరాన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్‌

ఇరాన్‌పై యుద్ధం మరింత తీవ్రతరం చేస్తాం: ట్రంప్‌

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

దుబాయ్ నుంచి సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు!

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

ఇంతకీ నెతన్యాహు ఎక్కడ? కొనసాగుతున్న సస్పెన్స్

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో యుద్ధం..ఇద్దరు సైనికులు మృతి

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు
0:30

ఇరాన్ ప్రతీకారం.. బహ్రెయిన్‌లో చెలరేగిన అల్లర్లు

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ట్రాఫిక్ కెమెరాల నిఘా: ఖమేనీ ఆచూకీ వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం

ట్రాఫిక్ కెమెరాల నిఘా: ఖమేనీ ఆచూకీ వెనుక ఇజ్రాయెల్ భారీ వ్యూహం

📢 For Advertisement Booking: 98481 12870