స్టాక్ మార్కెట్ నష్టాల నుండి తిరిగి కోలుకుంటూ ఊపందుకుంటున్న సమయంలో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (పేటీఎం) షేర్లు గురువారం పతనమయ్యాయి. ఈ వారంలోని నాల్గవ ట్రేడింగ్ రోజున Paytm షేర్లు 5 శాతం పడిపోయాయి, స్టాక్ ధర రూ.718.20 కనిష్ట స్థాయికి చేరుకుంది.

ప్రభుత్వ నిర్ణయం ఏంటి
2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2 వేల కంటే తక్కువ మొత్తం ఉన్న BHIM-UPI ట్రాన్సక్షన్ ప్రోత్సహించడానికి దాదాపు రూ.1,500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. సామాన్య ప్రజలు అలాగే చిన్న దుకాణదారుల ప్రయోజనం కోసం తీసుకువచ్చిన ఈ పథకం కింద ఒక వ్యక్తి దుకాణదారునికి రూ.2 వేల కంటే తక్కువ చెల్లించినట్లయితే, ప్రభుత్వం MDR (మర్చంట్ డిస్కౌంట్ రేటు) ఖర్చులను భరిస్తుంది. చిన్న వ్యాపార వర్గానికి చెందిన రూ.2 వేల వరకు లావాదేవీలకు, ప్రతి లావాదేవీ విలువలో 0.15 శాతం ప్రోత్సాహకం ఇవ్వబడుతుంది. ఈ ప్రోత్సాహకం చిన్న వ్యాపారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా UPI సేవలను పొందేందుకు వీలు కల్పిస్తుంది.
ఇప్పుడు స్టాక్ ధర ఎంత
పేటీఎం షేర్ల ధర నిన్నటి ముగింపు రూ.762.80 నుండి రూ.718.20 కనిష్ట స్థాయికి పడిపోయాయి. మే 2024లో ఈ స్టాక్ రూ.310 స్థాయికి చేరుకుంది. ఇదే ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి. అలాగే డిసెంబర్ 2024లో ఈ స్టాక్ రూ.1,063 స్థాయికి చేరుకుంది, ఇది 52 వారాల గరిష్ట స్థాయి. ఈ స్టాక్ గురించి బ్రోకరేజీలు భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నాయి. కొన్ని బ్రోకరేజీలు ఈ స్టాక్‌పై ‘న్యూట్రల్’ లేదా ‘హోల్డ్’ రేటింగ్‌ను సూచించాయి. నిపుణుల కంపెనీకి ప్రతికులం
బ్రోకరేజ్ జెఫరీస్ పేటీఎం షేర్లపై ‘హోల్డ్’ రేటింగ్ ఇచ్చింది, దీని టార్గెట్ ధర రూ.850. తక్కువ విలువ ఉన్న UPI P2M లావాదేవీలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 కోట్ల ప్రోత్సాహకం గత సంవత్సరంతో పోలిస్తే సగం మాత్రమేనని, ఇది కంపెనీకి ప్రతికూలమని బ్రోకరేజ్ చెబుతోంది. విదేశీ బ్రోకరేజ్‌లు ప్రోత్సాహకాన్ని 20 బేసిస్ పాయింట్ల నుండి 6 బేసిస్ పాయింట్లకు తగ్గించాలని ఆశిస్తున్నాయి. బ్రోకరేజ్ ప్రకారం, కంపెనీ ప్రోత్సాహకాలను దామాషా ప్రకారం తగ్గించినట్లయితే, దాని FY25 Ebitda అంచనాల కంటే 50 శాతం తక్కువగా ఉండవచ్చు. అంతే కాకుండా, మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ పై రూ. 870 టార్గెట్ ప్రైస్ నిర్ణయించారు. కంపెనీ స్టాక్ ఇప్పటికీ దాని IPO ధర కంటే 64 శాతం తక్కువగా ఉంది.