ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలిసిన క్షణమే పవన్ కల్యాణ్ తన ప్రభుత్వ పనులను పక్కనపెట్టి, తక్షణమే సింగపూర్ వెళ్లారు. సింగపూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు అత్యుత్తమ వైద్య సేవలు అందించబడ్డాయి. తండ్రి పవన్, భార్య అన్నా లెజినోవాతో కలిసి హాస్పిటల్‌కి వెళ్లి కుమారుడికి అండగా నిలిచారు. చికిత్స అనంతరం మార్క్ శంకర్ పూర్తిగా కోలుకోవడంతో, ఇప్పుడు వారు ముగ్గురూ కలిసి హైదరాబాద్కు తిరిగిరాగా, శంషాబాద్ విమానాశ్రయంలో వారు దిగిన క్షణం అభిమానులకు ఒక గొప్ప ఆనంద క్షణంగా మారింది..
పవన్ కుటుంబానికి ఫ్యాన్స్ స్వాగతం
ఈ ఉదయం పవన్ కల్యాణ్ తన భార్య అన్నా, కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (శంషాబాద్) చేరుకున్నారు. విమానాశ్రయం వెలుపల ఎదురు చూస్తున్న అభిమానులు తనను చూసి ఉత్సాహంతో నినాదాలు చేశారు. ముఖ్యంగా పవన్ తన కుమారుడిని చేతిలో ఎత్తుకుని బయటకు వస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read also: Hanuman : సంపూర్ణంగా విజయవంతమైన శోభాయాత్ర