దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే గురువారం (మార్చి 27) పరిస్థితి విషమించడంతో సత్యవతి తుది శ్వాస విడిచారు. దీంతో మెహర్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె మరణ వార్తతో మెహర్ రమేశ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.సత్యవతి మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్యవతి మరణం పట్ల ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
మెహర్ రమేశ్
మెహర్ రమేశ్ కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేది. తన చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ, విద్యార్థి దశలో వేసవి సెలవుల్లో మాచవరం వెళ్లేవాడినని, అప్పట్లో వారి ఇంట్లో గడిపిన జ్ఞాపకాలు ఇప్పటికీ చెరగనివని పవన్ కల్యాణ్ అన్నారు.పవన్ కల్యాణ్ తన ప్రకటనలో సత్యవతి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని , ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. ఈ వార్త విని తనకు ఎంతో బాధ కలిగిందని, మెహర్ రమేశ్ కుటుంబం ఈ కష్టకాలాన్ని అధిగమించాలని ఆకాంక్షించారు.
ప్రగాఢ సానుభూతి
టాలీవుడ్ దర్శక, నటులు, ఇతర పరిశ్రమలోని ప్రముఖులు కూడా మెహర్ రమేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఇతర సినీ ప్రముఖులు కూడా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.సత్యవతి మరణం మెహర్ రమేష్ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని సినీ పరిశ్రమ మొత్తం కోరుకుంటోంది.
మెహర్ రమేష్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి పెరిగాడు . అతని తండ్రి నగరంలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. రమేష్ మాచవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరులో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశాడు. ఇక దర్శకుడు కావడానికి ముందు మెహర్ రమేష్ బాబీ సినిమాలో ఓ సహాయక పాత్రను పోషించాడు. ఆ తర్వాత కన్నడ చిత్రం వీర కన్నడిగ (2004) తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మెహర్. ఇది తెలుగులో ఆంధ్రావాలా (2004)గా రిలీజైంది. అతని రెండవ చిత్రం అజయ్ (2006). ఇది మహేష్ ఒక్కడుకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యయి. కానీ తెలుగులో మాత్రం మెహర్ కు సరైన విజయం దక్కలేదు.