పాకిస్తాన్ (Pakistan)తన దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని దాచడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కానీ, ఎంత దాచాలని ప్రయత్నిస్తున్నా.. ప్రపంచానికి దాని నిజ స్వరూపం తెలుస్తూనే ఉంది. పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ సైన్యం (Pakistan Army) అమాయక మతాధికారిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (Lashkar e Taiba ప్రధాన నాయకుడు, సహాయక చర్యల ముసుగులో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. అతని పేరు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ (Hafeez Muhammad Saeed). గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఓ ఫొటోలో ఉన్న వ్యక్తి ఉగ్రవాది కాదని, మత నాయకుడు అని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ వ్యక్తి కొంతమంది పాకిస్తాన్ సైనికులతో పాటు అంత్యక్రియల ఊరేగింపులో కనిపించాడు. ఆ వ్యక్తి తన ఐడి కార్డు కూడా చూపించి తాను ఒక సాధారణ రాజకీయ కార్యకర్తనని చెప్పాడు.

అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం..
అయితే పాకిస్తాన్ సైన్యం ఇచ్చిన ఆ వ్యక్తి సమాచారం.. అంటే పేరు, పుట్టిన తేదీ, జాతీయ గుర్తింపు సంఖ్య కూడా అమెరికాచే ప్రత్యేకంగా నియమించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించబడిన వ్యక్తితో పూర్తిగా సరిపోలుతున్నట్లు తేలింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. హఫీజ్ అబ్దుల్ రవూఫ్ లష్కరే తోయిబా (LeT), దాని ఫ్రంట్ సంస్థల కోసం విరాళాలు సేకరిస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి చూపించిన ఐడి కార్డులో అతను “వెల్ఫేర్ వింగ్ ఇన్‌చార్జ్, పీఎంఎంఎల్” అని ఉంది, అంటే అతను తన కార్యకలాపాలను దాచడానికి ఒక రాజకీయ లేదా మతపరమైన సంస్థ పేరును ఉపయోగిస్తున్నాడు.
1999 నుండి లష్కర్ కోసం పనిచేస్తున్నాను..
యూఎస్ ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఫేస్ ఆఫ్ ది లష్కరే తోయిబాగా ఉన్నాడు. లష్కరే తోయిబా అగ్ర నాయకత్వ బృందంలో చేరిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ 1999 నుండి ఆ సంస్థ కోసం పనిచేస్తున్నాడు. రవూఫ్ లష్కరే ఫ్రంట్ సంస్థ ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ (FIF) అధిపతి, ఇది సహాయ చర్యల ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తుంది.
రవూఫ్ లష్కర్ మానవతా సహాయ డైరెక్టర్‌గా చెలామణి
2008లో రవూఫ్ లష్కర్ మానవతా సహాయ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు. 2003లో పబ్లిక్ సర్వీస్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆగస్టు 2008లో హఫీజ్ సయీద్ ఆదేశం మేరకు,పాకిస్తాన్‌లోని బజౌర్ ప్రాంతంలో సహాయ, నిధుల సేకరణ కార్యకలాపాలను సమీక్షించడానికి రవూఫ్ ఒక బృందానికి నాయకత్వం వహించాడు. ఇది మాత్రమే కాదు, రవూఫ్ లష్కర్ ప్రతినిధిగా కూడా ఉన్నాడు. హఫీజ్ రవూఫ్ లష్కర్ స్వచ్ఛంద విభాగం “ఇదారా-ఎ-ఖిద్మత్-ఎ-ఖల్క్” అంటే IKKకి కూడా నాయకత్వం వహించాడు.
Read Also: TRUMP: ‘కశ్మీర్ సమస్య పరిష్కరిస్తా’- ట్రంప్ కొత్త ప్రకటన