భారత సైన్యం మరోసారి దాయాది దేశం పాకిస్థాన్ సైనికుల ఆటకట్టించాయి. పాక్ సైన్యం చేసిన చొరబాటు యత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా భగ్నం చేశాయి. దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద-LOC వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

మందుపాతర పేలిన ఘటన
ఏప్రిల్ 1న కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని తెలిపాయి. ఈ నేపథ్యంలో అక్కడ మందుపాతర పేలిన ఘటన చోటుచేసుకుంది.ఆ తర్వాత పాక్ సైన్యం కాల్పులు జరిపి, ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొన్నాయి. అందుకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం, ఎదురుకాల్పు జరిపినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఐదుగురు చొరబాటుదారులు.. మరణించినట్లు తెలుస్తోంది. తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని భారత ఆర్మీ వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని తెలిపింది. భారత సైన్యం మరోసారి దాయాది దేశం పాకిస్థాన్ సైనికుల ఆటకట్టించాయి. పాక్ సైన్యం చేసిన చొరబాటు యత్నాలను భారత సైన్యం సమర్థవంతంగా భగ్నం చేశాయి. దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
సమర్థవంతంగా తిప్పికొట్టిన మన సైన్యం
గత రెండు నెలలుగా నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాలు, కాల్పులు ఘటనలు గణనీయంగా పెరిగాయి. ఉగ్రవాదులతో కలిసి పాక్ సైన్యం అనేకసార్లు చొరబాటు ప్రయత్నాలకు చేసినా వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో LOC వద్ద పాక్ సైన్యం కాల్పులు జరపడంతో పాటు పేలుడు పదార్థాలతో దాడులు చేశాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతను తగ్గించే ఉద్దేశంతో 2021లో భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాయి.