పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత, భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి.వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత్‌తో యుద్ధం వస్తే తుపాకీ పట్టుకోనని స్పష్టంగా చెప్పారు. బదులుగా, “నేరుగా ఇంగ్లండ్‌కి వెళ్లిపోతాను”అని చెబుతూ దేశభక్తిని ప్రశ్నార్థకం చేశారు.ఇప్పుడు ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు.ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.భారత్ ఈ ఘటన వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని గట్టిగా నమ్ముతోంది.దీంతో భారత్ సింధు జలాల ఒప్పందంపై తిరిగి ఆలోచిస్తోంది.పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది.మరోవైపు,పాకిస్తాన్ రాజకీయ నేతలు కొంతమంది యుద్ధ భాషణలు చేస్తున్న తరుణంలో, మార్వాత్ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

“మోదీ నా అత్త కొడుకా?” అంటూ వ్యంగ్య వ్యాఖ్య
విలేకరి ఓ ఇంటర్వ్యూలో మార్వాత్‌ను ప్రశ్నించారు:
“యుద్ధం వస్తే తుపాకీ పట్టుకుని ఫ్రంట్‌కి వెళతారా?” అని.
దానికి మార్వాత్ బదులు:
“ఆ సమయానికి నేను ఇంగ్లండ్‌లో ఉంటాను,అని నవ్వుతూ చెప్పారు.
వెంటనే మరో ప్రశ్న వచ్చిందీ:
“మీరు అనుకుంటున్నారా మోదీ వెనక్కి తగ్గుతారు?”
దీనికి ఆయన స్పందన మరింత గద్దించినట్టుంది:
“మోదీ నా అత్త కొడుకా?నా మాట వినగలడా?” అన్నారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ప్రతిస్పందన వచ్చింది.ప్రజలు–“ఇలాంటివాళ్లు ఉంటే, దేశ భవిష్యత్తు ఏమిటి?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.షేర్ అఫ్జల్ ఖాన్ మార్వాత్–పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (PTI) పార్టీకి చెందిన నేత.ఇది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన రాజకీయ పార్టీ.అయితే, మార్వాత్ గతంలో పార్టీ పాలసీలపై ఓపెన్గా విమర్శలు చేశారు.ఈ కారణంగా ఇమ్రాన్ ఖాన్ ఆయన్ను పార్టీ నుంచి తొలగించినట్టు సమాచారం.తాజా పరిణామాల్లో ఆయన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
నెటిజన్లను విభజించిన మార్వాత్ మాటలు
వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి.
“తమ నాయకులకు సైన్యం మీద నమ్మకం లేకపోతే, ప్రజల పరిస్థితి ఏమిటి?”
“దేశాన్ని కాపాడాల్సినవాళ్లు ఇలా మాట్లాడితే భద్రత ఎక్కడ?”
ఇలాంటి ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఇప్పుడు మార్వాత్ మాటలు కేవలం సోషల్ మీడియాలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారాయి.ఇది పాకిస్థాన్‌కు మంచి పేరు తెచ్చేదేనా? అనేది ఇప్పుడు డిబేట్ పాయింట్.
Read Also : India : రష్యా నుంచి ఇగ్లా-ఎస్ స్వల్ప శ్రేణి క్షిపణుల సేకరణ