భారత్‌కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ‘‘ఇప్పటిదాకా మూడు రఫెల్, ఒక ఎస్‌యు-30, ఒక మిగ్ -20, ఒక హెరాన్ డ్రోన్ సహా మొత్తం ఐదు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని నేను ధృవీకరిస్తున్నాను’’ అని పాకిస్తాన్ మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి ఓ వీడియోలో చెప్పారు.
అమిత్ షా ట్వీట్
ఆపరేషన్ సిందూర్ గురించి హోంమంత్రి మాట్లాడారు. మన సాయుధ బలగాలను చూస్తే గర్వంగా ఉందని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘‘పహల్గాంలో మన అమాయక సోదరులను పాశవికంగా చంపినందుకు ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ఇచ్చిన జవాబు ఇది’’ అని హోం మంత్రి ఎక్స్‌లో రాశారు. ‘‘భారత్‌పైనా, భారత ప్రజలపై జరిగే ఎలాంటి దాడికైనా మోదీ ప్రభుత్వం తగిన సమాధానమిస్తుంది. అని అమిత్ షా తన పోస్టులో పేర్కొన్నారు.

భారత్ మాతా కీ జై: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అలాగే భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ మాతా కీ జై అని ట్వీట్ చేశారు. సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా, జై హింద్ అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
మనందరం ఒకే గళం వినిపిద్దాం – జై హింద్!: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

‘‘మనందరం ఒకే గళం వినిపిద్దాం – జై హింద్!’’ అని రాశారు.
ప్రముఖ నటుడు చిరంజీవి కొణిదెల తన ఎక్స్ ఖాతాలో ఆపరేషన్ సిందూర్ ఫోటోను షేర్ చేసి జై హింద్ అని ట్వీట్ చేశారు. ‘‘పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మన రక్షణ దళాలు జరిపిన దాడులను స్వాగతిస్తున్నా. మరోసారి పహల్గాం లాంటి దాడులు జరగకుండా పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలి.
Read Also: Operation Sindhur: భారత్ దాడిపై పాక్ ప్రధాని స్పందన