జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిలో 26 మంది చనిపోయారు. ఈ దాడికి నిరసనగా కశ్మీర్‌లో వ్యాపార సంస్థలను, విద్యా సంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా సౌకర్యాలు కూడా ఈ దాడి వల్ల ప్రభావితమయ్యాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కు చెందిన సెక్యూరిటీ బృందం శ్రీనగర్‌కు చేరుకుంది. మరిన్ని భద్రతా బలగాలు, ఉన్నత భద్రతా అధికారులు పహల్గాం చేరుకునే అవకాశం కనిపిస్తోంది. పహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరంలోని బైసరన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. జమ్మూకశ్మీర్‌కు వచ్చే పర్యటకులు అత్యంత ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో పహల్గాం ఒకటి. పచ్చిక బయళ్లు, అందమైన సరస్సులతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యటకులు వస్తుంటారు. అధికారిక లెక్కల ప్రకారం 2024లో 35 లక్షల మంది కశ్మీర్‌లో పర్యటించారు. మార్చి నుంచి జూన్ మధ్య కాలంలో పర్యటకులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.

అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు తీవ్రమైన చలి
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం మంచుతో కప్పేసి, తీవ్రమైన చలి ఉంటుంది.
స్విట్జర్లాండ్‌లోని లంగెర్న్ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి పహల్గానికి దగ్గర పోలికలు ఉన్నాయని ప్రకృతి ప్రేమికులు అంటుంటారు.
స్విట్లర్లాండ్‌లో ఉన్నట్లు కనుచూపు మేర ముదురు ఆకుపచ్చ రంగులో పచ్చిక మైదానాలు బైసరన్ వ్యాలీలో కనిపిస్తుంటాయని, అందుకే తరచూ దీన్ని ‘మినీ స్విట్జర్లాండ్’గా చెబుతుంటారని పహల్గాం డెవలప్‌మెంట్ అథారిటీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. పహల్గాం చుట్టూ చూడదగ్గ ప్రదేశాలేంటి? అనంత్‌నాగ్ జిల్లాలో చుట్టూ పచ్చని అరణ్యంతో, ఎత్తైన కొండల మధ్యన పహల్గాం ఉంటుంది.

అత్యంత సమీపంలో ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం
పహల్గాంకు అత్యంత సమీపంలో ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు ఈ ప్రాంతం 96 కి.మీ. దూరంలో ఉంటుందని అనంత్‌నాగ్ జిల్లా వెబ్‌సైట్‌లో పేర్కొంది.
Read Also: Kashmir : పహల్గాంలో ఉగ్రదాడి స్పందించిన సినీ ప్రముఖులు