ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవు. రాజస్థాన్ జట్టులోకి మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగొచ్చాడు. లెఫ్టార్మ్ పేసర్ ఫజల్ హక్ ఫరూఖీని పక్కనబెట్టారు. టోర్నీలో ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించగా రాజస్థాన్ జట్టు 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు నమోదు చేసింది.
ఎక్స్ ఖాతా
మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను వీల్‌చైర్‌లో కలవడం హృదయాన్ని తాకింది. రాజస్థాన్ రాయల్స్ ఈ వీడియోను షేర్ చేయగా నెటిజన్లను కదిలించింది. కోహ్లీ తన గురువుకు ఇచ్చిన గౌరవం ఎంతో మందికి ప్రేరణగా మారింది. ఇదే సమయంలో విక్రమ్ రాథోడ్‌తో కలిసి భారత జట్టు విజయాల్లో ద్రవిడ్ పాత్రను గుర్తు చేసుకున్నారు.గాయంతో బాధపడుతూ వీల్‌చైర్‌లో ఉన్న రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి పలకరించడం హృదయాన్ని హత్తుకుంది. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ తమ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకుంది. “నువ్వు చిన్నవాడివైనా లేదా 18వ నంబర్‌లో ఉన్నా, పెహ్లే తో రాహుల్ భాయ్ సే హాయ్ మిల్నా హై” అనే క్యాప్షన్‌తో షేర్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంది.
టీ20 ప్రపంచ కప్
రాహుల్ ద్రవిడ్ హయాంలో 2022 నుంచి 2024 మధ్య కాలంలో భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్ కూడా కీలక పాత్ర పోషించారు.ఇద్దరూ అద్భుతంగా కలిసి పనిచేసి, బార్బడోస్ వేదికగా జరిగిన 2024 టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. రాథోడ్ గతంలో భారత్ తరపున ఆరు టెస్టులు కూడా ఆడారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టు
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఫర్ఖాల్ శర్మ, యుధ్వీర్ సింగ్ చరక్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫాకా, వనిందు హసరంగా, అశోక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్, సుయాష్ దర్బ్, సలామ్ బెథెల్, స్వప్నిల్ సింగ్, లుంగి ఎన్గిడి, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మోహిత్ రాథీ, స్వస్తిక్ చికారా, అభినందన్ సింగ్ వంటి ఆటగాళ్లు చోటు సంపాదించారు.
Read Also: IPL 2025: మాక్స్ వెల్ పై శ్రేయస్ అయ్యర్ ఆగ్రహం