हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Donald Trump: 3 లక్షల మంది భారతీయులపై ఓపీటీ ప్రభావం

Vanipushpa
Donald Trump: 3 లక్షల మంది భారతీయులపై ఓపీటీ ప్రభావం

అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత చేసే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ ను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలతో ఓ బిల్లును కూడా సిద్ధం చేశారు. అమెరికన్ కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో చదువుకుంటున్న 3 లక్షల మంది భారతీయుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఈ ప్రతిపాదిత బిల్లు నేపథ్యంలో విదేశీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

3 లక్షల మంది భారతీయులపై ఓపీటీ ప్రభావం

ఓపీటీ అంటే ఏమిటీ ?
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.. అమెరికాలోని యూనివర్సిటీలలో చదువు పూర్తిచేసుకున్న విదేశీ విద్యార్థులకు మూడేళ్ల పాటు ప్రాక్టికల్ వర్క్ కోసం అనుమతిచ్చే కార్యక్రమం. ఈ ప్రోగ్రాం కారణంగా విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమెరికాలోనే మూడేళ్ల పాటు పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆ అనుభవంతో అదే కంపెనీలో పనిచేస్తూ హెచ్ 1 బీ వీసా పొందడం లేదా మరో కంపెనీలో హెచ్ 1 బీ వీసాతో ఉద్యోగం పొందే వీలుంటుంది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు తమ కోర్సు పూర్తవగానే ఇండియా విమానం ఎక్కాల్సి వస్తుంది. దీనివల్ల వారు కెరీర్ పరంగా, ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతారు.
అమెరికా యూనివర్సిటీలలో తగ్గుతున్న విద్యార్థులు
ఈ ప్రోగ్రాం ఎత్తివేస్తే విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలలో చేరే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా యూనివర్సిటీలకు, అమెరికాకు ఆదాయం తగ్గుతుంది. దీంతోపాటు అమెరికా కంపెనీలకు నిపుణులైన ఉద్యోగులు దొరకడం దుర్లభంగా మారుతుంది. ఏటా పరిమిత సంఖ్యలో జారీ చేసే హెచ్ 1 బీ వీసాలతో కంపెనీల మానవ వనరుల అవసరాలు తీరే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Trump Tariffs: ఫార్మా రంగంపై ట్రంప్ భారీగా పన్నుల మోత?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870