ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ చరిత్ర సృష్టించారు.బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ 217/6 పరుగులు చేయడంలో సాయి కీలక పాత్ర పోషించాడు. కేవలం 53 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేసిన సుదర్శన్, జట్టుకు శక్తివంతమైన ప్రారంభాన్ని అందించాడు. ఇది ఐపీఎల్‌లో అతని 30వ ఇన్నింగ్స్ కాగా, ఇప్పటివరకు 1307 పరుగులతో సుదర్శన్ అత్యధిక పరుగులు చేసిన భారతీయుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. షాన్ మార్ష్ (1338) మాత్రమే అతనికంటే ముందున్నాడు. క్రిస్ గేల్ (1141), కేన్ విలియమ్సన్ (1096), మాథ్యూ హేడెన్ (1082) వంటి దిగ్గజాలు అతని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఏకైక భారతీయుడు
తన ఇన్నింగ్స్‌పై సాయి స్పందిస్తూ, “ప్రారంభంలో పిచ్ కాస్త ఊగిసలాడింది. ఆర్చర్ మంచి ప్రారంభం ఇచ్చాడు. కానీ ఆ తర్వాత మేము స్థిరపడి, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందని గ్రహించాము. ఆ కారణంగా మేము మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం,” అని తెలిపాడు. జట్టుగా వారు ఇంకా 15 పరుగులు ఎక్కువ చేయవచ్చుననే అభిప్రాయం ఉన్నా, ఇది మంచి స్కోరేనని సాయి అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై వరుసగా ఐదుసార్లు 50కి పైగా స్కోరు చేసిన ఏకైక భారతీయుడు కూడా సాయి సుదర్శన్‌నే. గత సీజన్‌లో కూడా ఇదే స్టేడియంలో అతను అజేయంగా 84 పరుగులు చేసి, మరో మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన ఘనత అతనికే చెందింది. ఈ మ్యాచ్‌లో కూడా అతని స్ట్రైక్ రేట్, కూల్ మైండ్ గేమ్ ప్లాన్ గుజరాత్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాయి.

రెండో ఇన్నింగ్స్
నేను స్థిరంగా ఆడేందుకు ప్రయత్నించటం లేదు. పరిస్థితిని ఎలా ఉన్నదో అర్థం చేసుకొని, దానికి అనుగుణంగా స్పందిస్తూ ఉత్తమంగా ప్రదర్శించాలనుకుంటున్నాను,” అని చెప్పాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ గురించి మాట్లాడుతూ,అతని బంతులు వికెట్ మీద నిలిచాయి. నెమ్మదిగా వేసిన బంతులు కూడా ఎఫెక్టివ్‌గా మారాయి,” అని వివరించాడు.రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉండకపోవచ్చన్న అంచనాలో, 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం రాజస్థాన్ రాయల్స్‌కి అంత ఈజీ కాదని సాయి పేర్కొన్నాడు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. హెట్మయర్ 32 బంతుల్లో 52 పరుగులు చేయగా, కెప్టెన్ సంజు శాంసన్ 28 బంతుల్లో 41 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లంతా విఫలమవ్వడంతో రాజస్థాన్ చేతులెత్తేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3/24తో ధాటిగా బౌలింగ్ చేస్తే, రషీద్ ఖాన్ 2/37, సాయికిశోర్ 2/20తో మిగతా బ్యాటర్లను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు.
Read Also:IPL 2025 :రాజస్థాన్ రాయల్స్‌పై గుజరాత్ విజయం