हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

Health: వేసవిలో శక్తినిచ్చే ఉల్లిపాయ

Anusha
Health: వేసవిలో శక్తినిచ్చే ఉల్లిపాయ

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఇందులోని గొప్ప గుణాలు శరీరానికి మేలు చేస్తాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ గుణాలు ఎక్కువగా ఉండే ఉల్లిపాయలను తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉల్లిలోని ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి పచ్చి ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని ఇష్టం ఉండదు. కానీ, నిత్యం ఓ ఉల్లిపాయను పచ్చిగా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం అది అలవాటుగా మారుతుంది. ముఖ్యంగా వేసవిలో ఉల్లిపాయ తినటం శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పచ్చి ఉల్లిపాయల్లో నీటిశాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల బాడీ హైడ్రేట్‌గా, చల్లగా ఉంటుంది. వీటితోపాటు ఉల్లిపాయలో ఉండే ఎసెన్షియల్ ఎలక్ట్రోలైట్స్ అయిన పొటాషియం ఉంటుంది. ఇది బాడీలో ఫ్లూయిడ్‌ని రెగ్యులేట్ చేస్తుంది. వేసవిలో చెమట వల్ల తగ్గిన ఎలక్ట్రోలైట్స్ కూడా ఉల్లిపాయ తినటం వల్ల బ్యాలెన్స్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ఉల్లిపాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ తినటం వల్ల చాలాసేపటి వరకూ కడుపు నిండుగా ఉంటుంది.దీంతో త్వరగా ఆకలి వేయదు,ఎక్కువగా తినకుండా ఉంటారు.దీంతో త్వరగా బరువు తగ్గుతారు. పచ్చి ఉల్లిపాయల్లోని గుణాలు గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను దరిచేరకుండా చేస్తాయి.

జీర్ణ వ్యవస్థ

జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు బాగా పనిచేస్తాయి. వీటి రసాన్ని తలకు రాస్తుంటే జుట్టు పెరుగుతుంది. వీటిని రెగ్యులర్‌గా వాడడం వల్ల జుట్టు సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి. కాబట్టి ఉల్లిపాయలను జ్యూస్‌లా చేసి ఆ రసాన్ని స్కాల్ప్‌కి పట్టించాలి. దీనిని పెట్టిన రోజే షాంపూ చేయకుండా నెక్ట్స్ డే చేయాలి.ఉల్లిపాయలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మీకు కడుపులో, ఛాతిలో మంట సమస్య ఉంటే మీరు పచ్చి ఉల్లిపాయను తీసుకోవచ్చు.సాధారణంగా ఎండాకాలంలో ఎక్కువగా జీర్ణ సమస్యలు వస్తుంటాయి. తిన్నది అరగకపోవడం, ఆకలి తగ్గడం వంటివి ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు ఉల్లిపాయ తినటం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులోని డైటరీ ఫైబర్, ప్రిబయోటిక్స్, డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కూడా జీర్ణ వ్యవస్థని కాపాడి హెల్దీగా ఉంచుతాయి.

 Health: వేసవిలో శక్తినిచ్చే ఉల్లిపాయ

చల్లబరిచే

ఉల్లిపాయలు తినడం వల్ల ఎముకలు బలపడతాయి. ఎందుకంటే ఉల్లిపాయలో ఎముకలను బలోపేతం చేసే అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి, మీ ఎముకలు బలహీనంగా ఉంటే, మీరు పచ్చి ఉల్లిపాయను తినవచ్చు.మీకు జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కాబట్టి, మీరు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, పొట్టను ఆరోగ్యంగా ఉంచడానికి సలాడ్ రూపంలో ఉల్లిపాయను తీస్కోవచ్చు.ఉల్లిపాయల్లో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఇవి బాడీ టెంపరేచర్‌ని తగ్గిస్తాయి. వేడి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మనం పచ్చి ఉల్లిపాయల్ని లేదా కొద్దిగా కుక్ చేసి తిన్నప్పుడు అవి సల్ఫర్, క్వెర్సెటిన్ వంటి కాంపౌండ్స్‌ని రిలీజ్ చేస్తాయి. ఇవి బాడీలో వేడిని తగ్గిస్తాయి. వేసవిలో కలిగే శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. సన్ స్ట్రోక్ ప్రభావం తగ్గుతుంది.

Read Also : Health: మైగ్రేన్‌ తో బాధపడుతున్నారా అయితే ఈ టిప్స్‌ మీకే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

📢 For Advertisement Booking: 98481 12870