ఒడిశా రాష్ట్రంలోని గహీర్‌మఠ సముద్ర తీరానికి అలౌకిక ప్రకృతి దృశ్యం కనువిందు చేస్తోంది. వేలాది ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఈ ప్రకృతి విశేషాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. నవంబర్ నుంచి మార్చి వరకు తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ చేరుకుంటాయి. స్వచ్ఛమైన ఇసుక తీరాలు, తగిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ప్రదేశం వీటి గుడ్లు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది.
గుడ్లు పెట్టే తీరా?
ఒక్కో తాబేలు 50 నుంచి 100 గుడ్లు పెడుతుంది. వెన్నెల రాత్రుల్లో తీరంలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు వేలాది పిల్ల తాబేళ్లుగా మారి సముద్రంలో తిరిగి వెళ్లడం ఒక అద్భుత ప్రకృతి సంఘటన.

ప్రభుత్వ సంరక్షణ చర్యలు
తాబేళ్ల సంరక్షణ కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. చేపల వేటను పూర్తిగా నిషేధించి తాబేళ్ల రక్షణకు చర్యలు చేపట్టారు. తీరాన్ని కాపాడేందుకు అదనపు సిబ్బంది, గస్తీ బృందాలు ఏర్పాటు చేశారు.
పర్యాటక నియంత్రణ
తాబేళ్ల రక్షణ కోసం పర్యాటకుల ప్రవేశాన్ని పరిమితం చేశారు. తీర ప్రాంతంలో తాబేళ్ల గుడ్లను నాశనం చేయకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాబేళ్ల ప్రాముఖ్యత గురించి స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఇప్పటి వరకు 7 లక్షల తాబేళ్లు వచ్చాయి, ఇంకా 3 లక్షల వరకు రానున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.