తమిళనాడులోని చెన్నై సమీపంలో ఒక విషాదకర సంఘటన జరిగింది.మధురాంతకంలో ఉంటున్న మణికందన్ అనే 29 ఏళ్ల వ్యక్తి తాను పట్టుకున్న చేప తన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో మరణించాడు. మధురాంతకంలోని ఒక సరస్సులో మంగళవారం ఉదయం అతడు చేపలు పట్టేందుకు వెళ్లాడు. ముందుగా ఒక చేపదొరికింది. అక్కడే మరొకటి కనిపించింది. దాంతో ముందుగా పట్టుకున్న చేపను ఎక్కడో పెట్టాలో అర్థం కాకపోవటంతో దాన్ని నోటితో పట్టుకుని మరో చేప కోసం ప్రయత్నించాడు.ముందుగా దొరికిన చేపను నోట్లో పెట్టుకున్న మణికందన్ మరొకదాన్ని రెండు చేతులతో పట్టుకోవడానికి నీళ్లలోకి వంగి పట్టుకున్నాడు. అప్పుడే అతని నోటిలో ఉన్న చేప నోట్లోకి తల దూర్చి మరింత లోపలికి వెళ్లి అతని శ్వాసనాళంలోకి దూసుకెళ్లింది. దాంతో మణికందన్ ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ గిలగిలాడిపోయాడు. గొంతులోకి దూసుకెళ్లిన చేపను బయటకు లాగడానికి ప్రయత్నిస్తూ నీటిలోంచి బయటకు పరుగెత్తాడు. భయాందోళనతో అతను సమీపంలోని అరయ్యప్పక్కం గ్రామంలోని తన ఇంటి వైపు పరిగెత్తాడు. అతని గొంతులోకి దూరిన చేపను తొలగించడానికి కొంతమంది స్థానికులు ప్రయత్నించారు.కానీ దాని వీపుపై ఉన్న ముళ్లు పొడువుగా ఉండడంతో, శ్వాసనాళ మార్గంలో చిక్కుకున్నందున వారు దాన్ని బయటకు లాగలేకపోయారు. హుటాహుటిన మణికందన్‌ను చెంగల్‌పేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయినట్లుగా ప్రకటించారు. రోజువారీ కూలీ అయిన మణికందన్ సరస్సులో చేపలు పట్టేవాడని, తను చేతులతోనే చేపలు పట్టడంలో నిపుణుడని స్థానికులు తెలిపారు. అతను సాధారణంగా ఎప్పూడు స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లేవాడని, కానీ మంగళవారం అతను ఒంటరిగా వెళ్లినట్టుగా చెప్పారు. దాంతో అతనికి సాయం చేయడానికి దగ్గరల్లో ఎవరూ లేకుండా పోయారని గ్రామస్తులు వాపోయారు. మణికందన్ మరణంతో వారి కుటుంబం, అటు గ్రామంలోనూ విషాధ ఛా యలు అలుముకున్నాయి.

జాగ్రత్తలు
చేపలను నోట్లో పెట్టకూడదు,తాత్కాలికంగా చేపను ఉంచడానికి చిన్న ప్యాకెట్ లేదా బకెట్‌ను ఉపయోగించాలి.ఎప్పుడూ కనీసం ఇద్దరు కలిసి వేటకు వెళ్లాలి.లైఫ్ జాకెట్లు, గ్లౌజ్‌లు, బూట్లు వంటివి ధరించాలి.
Read also: RBI: లక్ష నుండి 2 లక్షల వరకు ఆర్బీఐ అనుమతి