కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్నీ ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీలు యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై సోమవారం లో క్ సభలో రాహుల్ మాట్లాడుతూ పదేపదే చైనా పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే .కాగా ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించడంతో లో క్ సభలో వాతావరణం వేడెక్కింది .

రాహుల్ తాను చేసిన ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు అందించడం లో విఫలమైతే ఆయన పై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది .కాగా ఇటీవల అగ్ర నాయకురాలు సోనియాగాంధి పై బీజేపీ ఎంపీలు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు . పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌ పదిముర్ము చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ అభ్యంతరకర పదాలు వాడినందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.లో క్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ . తయారీ రంగంలో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుందన్నారు .ఆ దేశానికి చెందిన మోటర్లు , బ్యాటరీలు , ఆప్టికల్స్ దిగుమతుల పై ఇప్పటికి భారత్ ఆధారపడటాన్ని ఆయన తప్పుబట్టారు . ప్రధాని మోదీ చేపట్టిన ‘ మేక్ ఇన్ ఇండియా ‘ విఫలం కావడం వల్లే బీజింగ్ నుంచి వస్తువులు దేశంలోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు.