हिन्दी | Epaper

Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Shobha Rani
Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఒడిశా (Odisha) దండకారణ్యంలో మరోసారి ఎన్‌కౌంటర్‌ (Encounter) కలకలం రేపింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడితో సహా పార్టీ సభ్యుడు మృతి చెందినట్టుగా తెలిసింది. ఈ ఘటన కంధమల్ జిల్లా లో సోమవారం రోజున జరిగిందని తెలిసింది.
సుఖాలద గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో..
ఒడిశా రాష్ట్రం కంధమల్ జిల్లా (Kandhamal district)పోలీస్ స్టేషన్ పరిధిలోని సుఖాలద (Sukalada)గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారాసపడ్డారు. తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పును ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి భారీగా పోలీసులు మందుగుండు సామాగ్రి, రైఫిళ్లు, పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు చందన్, మంకుగా గుర్తించారు.
భద్రతా దళాల దృఢ కార్యాచరణ
ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయని పోలీసు (Police) వర్గాలు ధృవీకరిస్తున్నాయి. భద్రతా సిబ్బంది దట్టమైన అడవిని జల్లెడపడుతున్నారు. మృతిచెందిన మావోయిస్టులు గతంలో హింసాత్మక కార్యకలాపాలలో పాల్గొన్నారని చెబుతున్నారు. మావోయిస్టుల నిర్మూలన ఈ ప్రాంతంలో తీవ్రవాద ప్రభావాన్ని అరికట్టే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రశంసలు
ఆపరేషన్‌ను ఖచ్చితత్వంతో, ధైర్యంగా నిర్వహించినందుకు ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యోగేష్ బహదూర్ (Yogesh Bahadur)ఖురానియా ఎస్పీ హరీష్ బిసి, డివిఎఫ్ బృందాన్ని అభినందించారు.

Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

మావోయిస్టుల నిర్మూలనలో ముందడుగు
ఈ ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించే మైలురాయిగా భావిస్తున్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికిని నిర్మూలించేందుకు ఇది కీలకంగా మారనుంది. స్థానిక ప్రజల భద్రతకు ఇది అత్యవసర చర్యగా చెప్పొచ్చు.

Read Also: Bengaluru: ప్రియురాలిని హత్య చేసి చెత్తలారీలో పడేసిన ప్రియుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870