ఐపీఎల్ 2025 సీజన్‌లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధమైంది.లీగ్ చరిత్రలో చెరో ఐదు సార్లు ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. వాఖండే స్టేడియం వేదికగా ఈ బ్లాక్ బాస్టర్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య పోరులో లెజెండ్స్ ధోనీ, రోహిత్ శర్మనే ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా మహీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు హిట్ మ్యాన్.ఈ ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత ఏడాది కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అతడు.. ఈ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ గా మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 13.67 మాత్రమే ఉంది. ఇక రీసెంట్ గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లోనూ అతడు భారీ స్కోర్ చేయలేకపోయాడు. 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు. కానీ ఉన్నది కాసేపే అయినా తన స్ట్రోక్‌ప్లేను కాస్త చూపించాడు. అందులో 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక ధోనీ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో 43.33 సగటుతో 130 పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. రెండు మ్యాచుల్లో మెరుపు వేగంతో కళ్లు చెదిరే స్టంపింగ్ కూడా చేశాడు.
రిలాక్స్ అవ్వకూడదు
రోహిత్ శర్మ మాట్లాడుతూ “ధోనీ చాలా కాలం పాటు సారథిగా ఉన్నాడు. ఎన్నో మ్యాచ్‌లు, ఎన్నో ట్రోఫీలు గెలిచాడు. కాబట్టి అతడిపై ఆడుతుంటే ఏ మాత్రం రిలాక్స్ గా ఉండలేము. ధోనీతో అంత ఈజీ కాదు. అతడు ఉన్నప్పుడు మ్యాచును అతడి నుంచి మనవైపు తిప్పుకోవడం అంత సులభం కాదు. ఏ సమయంలోనైనా అతడు గేమ్‌ను తన ఆధీనంలోకి తీసేసుకుంటాడు. కాబట్టి అతడు ఉంటే మ్యాచు జరిగినంత సేపు పూర్తి అలర్ట్‌గా ఉండాలి. రిలాక్స్ అస్సలు అవ్వకూడదు.” అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.రోహిత్ శర్మ కెప్టెన్‌గా గొప్ప రికార్డు కలిగివున్నప్పటికీ, అంతకన్నా ఎక్కువగా మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ చరిత్రలోనే గొప్ప క్రికెట్ నాయకుడిగా గుర్తింపు పొందాడు. మహీ కేవలం చెన్నై జట్టుకు విజయాలు అందించడమే కాదు భారత క్రికెట్ చరిత్రలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. తన నాయకత్వంలో ఐసీసీ ట్రోఫీలను అందించాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో అంచనాలు లేని భారత జట్టుకు నాయకత్వం వహించి ట్రోఫీని తీసుకొచ్చాడు. ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సహా అనేక విజయాలను భారత్ కు అందించాడు.
ఆరు మ్యాచుల్లో
ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ కూడా ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఆడిన ఐదు మ్యాచుల్లో 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడు తన బ్యాటను ఝళిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి తర్వాత ఆడబోయే మ్యాచుల్లోనైనా హిట్ మ్యాన్ రాణిస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ట్రావిస్ హెడ్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో 214 పరుగులు చేశాడు. అందులో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 67 పరుగులు.
Read Also: KL Rahul: పాప పేరును రివీల్ చేసిన కేఎల్ రాహుల్ ఏం పేరు పెట్టారో తెలుసా!