తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు

తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందటంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణా ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణాలో బర్డ్ ఫ్లూ లేదని, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు సైతం చెప్తున్నారు. అయినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
ఆ ప్రచారాన్ని నమ్మవద్దు
దాణా తెచ్చే వాహనాలు సైతం శానిటైజ్ చేసి కోళ్ళ ఫారాలకు అనుమతించాలని, శానిటైజ్ చెయ్యకుంటే ఇబ్బంది వస్తుందని అంటున్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి వెల్లడించారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం ఇతర కారణాలతో కోళ్లు మరణించినట్టు ఆయన పేర్కొన్నారు. చికెన్ తినొచ్చా? అధికారులు చెప్తుందిదే తెలంగాణ రాష్ట్రంలో చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో చికెన్ తినకూడదని తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఆ ప్రచారాన్ని నమ్మవద్దని వెల్లడించారు.

Advertisements
తెలంగాణ బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదు

ఇతర కారణాలతో మృతి

వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతి పైన రక్త నమూనాలను ల్యాబ్ కు పంపించామని, అవి ఇతర కారణాలతో మృతి చెందినట్లు తేలిందని ఆయన అన్నారు బర్డ్ ఫ్లూ పై పౌల్ట్రీ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. చికెన్ తింటే అలాగే తినాలి కోళ్ల ఫారాల చుట్టూ బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని, కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్తోకే అవకాశం చాలా తక్కువ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.. బాగా చికెన్ ఉడికించి తినడం వల్ల వైరస్ బతికే ఛాన్స్ ఉండదని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

ఏపీ నుండి వచ్చే కోళ్ళ వాహనాలు వెనక్కి

ఏపీ నుండి వచ్చే కోళ్ళ వాహనాలు వెనక్కు ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చే సరిహద్దుల్లో తనిఖీలు పెంచింది. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ కొనసాగుతుంది. ఈ నెల 7తారీకు నుండి రాష్ట్ర బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బర్డ్ ఫ్లూ లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధి వ్యాప్తించకుండ చర్యలు తీసుకుంటున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు కోళ్ళ ఫారాలను సందర్శించి రైతులకు సూచనలు చేస్తున్నారు.

Related Posts
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
Gadari Kishore Kumar

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మాటలతో ర్యాగింగ్ చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్. సిమెంట్ బస్తాలు అమ్ముకుంటూ అక్కడే కూర్చొని బీర్లు తాగే వాడు Read more

కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి యువకుల మృతి
kondapochamma dam

సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మార్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు యువకులు మృతి చెందారు. Read more

నేడు ప్రధానితో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
CM Revanth Reddy meet the Prime Minister today

మోడీ అపాయింట్‌మెంట్‌ కోరిన రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 10.30కు ప్రధాని మోడీని కలవనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్‌ సమాచారం రావడంతో ఆయన Read more

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి
satyanarayana

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ (99) అనారోగ్య కారణాలతో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని పెదగోగాడలో తుదిశ్వాస విడిచారు. మాడుగుల నియోజకవర్గం నుంచి Read more