ఒకేసారి బందీలను విడుదల చేయం: హమాస్

ఒకేసారి బందీలను విడుదల చేయం: హమాస్

పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా శ్మశానాన్ని తలపిస్తోంది. వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేయడం, పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయడం జరుగుతోంది. అయితే, ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడంలో హమాన్ చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ… శనివారంలోపు బందీలను అందరినీ ఓకేసారి విడుదల చేయాలని… లేకపోతే హమాస్ కు నరకం చూపిస్తానని హెచ్చరించారు.

ఒకేసారి బందీలను విడుదల చేయం: హమాస్

ఒప్పందానికి కట్టుబడి వున్నాం

ఈ నేపథ్యంలో హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ స్పందిస్తూ… శనివారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని చెప్పారు. అల్ జజీరాతో తో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని… ఒకేసారి బందీలను విడుదల చేసే ప్రసక్తే లేదని చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని… అందుకే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని తెలిపారు.

హమాస్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పోరు
ఇజ్రాయెల్ దాడులతో గాజా భూభాగం శ్మశానంగా మారిన పరిస్థితి కొనసాగుతుండగా, హమాస్ బందీల విడుదల విషయంలో నెమ్మదిగా స్పందిస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు.

ట్రంప్ హెచ్చరిక – హమాస్ కు కఠిన వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారంలోగా బందీలను ఒకేసారి విడుదల చేయాలని, లేకపోతే హమాస్ కు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. హమాస్ వేగంగా చర్యలు తీసుకోకపోతే, మరింత మిలిటరీ ఒత్తిడి పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. అల్ జజీరాతో జరిగిన ఇంటర్వ్యూలో, “ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, అందుకే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని” హమాస్ పేర్కొంది.

Related Posts
ఇండోనేషియా అగ్నిపర్వత పేలుడు: 9 మంది మృతి
indonesia

ఇండోనేషియాలోని ఫ్లోరస్ ద్వీపం వద్ద "లెవోటోబి లాకి లాకి" అగ్నిపర్వతం మంగళవారం విరుచుకుపడి, అనేక గ్రామాలను ధ్వంసం చేసింది. ఈ పేలుడు వలన 9 మంది ప్రాణాలు Read more

అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల అంశంపై పవన్ వ్యాఖ్యలు
pawan amazon

అమెజాన్ లో గిఫ్ట్ కార్డుల నిర్వహణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గిఫ్ట్ కార్డులలో డబ్బు జమ చేయడం చాలా Read more

PM Modi: మోదీ విదేశీ టూర్ కోసం రూ. 258కోట్లు ఖర్చు
PM Modi: మోదీ విదేశీ పర్యటనలకు రూ. 258 కోట్లు ఖర్చు కేంద్రం వెల్లడి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ఖర్చు గురించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక సమాచారం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని విదేశీ Read more

యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ మెసేజ్
yogi

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ ముంబై పోలీసులకు దుండగులు మెసేజ్ పంపడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. 10 రోజుల్లోగా యోగి రాజీనామా Read more