భారత గగనతలంపై పాకిస్థాన్‌కు చెందిన విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల రోజుల పాటు పొడిగించింది (Extended for another month). భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తూ పాకిస్థాన్ (Pakistan closing its airspace) తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా భారత్ ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఎయిర్ మెన్ కు ప్రత్యేక నోటీసు (నోటమ్) జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలతో ఈ నిషేధాన్ని జూన్ 23 వరకు (Until June 23) పొడిగించింది.ఈ నిర్ణయానికి అనుగుణంగా, ఎయిర్ మెన్ (NOTAM) ప్రకటన జారీ అయింది. ఇది శుక్రవారం అధికారికంగా విడుదలైంది.పాకిస్థాన్‌లో రిజిస్టర్ అయిన విమానాలు ఇక భారత్‌కు రాదు. పాకిస్థాన్ (Pakistan) ఎయిర్‌లైన్స్, లీజ్‌కి తీసుకున్నవి, పాక్ సైనిక విమానాలు కూడా నిషేధంలో ఉన్నాయి.ఈ నిషేధంతో ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా రూట్లపై ప్రభావం పడుతుంది. పాక్ విమానాలు భారత్‌ను చుట్టి ప్రయాణించాల్సి వస్తుంది.

సమయం, ఖర్చులు రెండింటిపై ప్రభావం
చుట్టు ప్రయాణం వల్ల పాకిస్థాన్ విమానాలకు సమయం పెరుగుతుంది. ఇది నేరుగా ఫ్యూయల్, నిర్వహణ ఖర్చులపై భారం పెడుతుంది.ఇటీవల జమ్ము కశ్మీర్‌లో పహల్గామ్ వద్ద తీవ్ర దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
దాడికి భారత్ స్పందన – ఆపరేషన్ ‘సిందూర్’
దాడి తర్వాత భారత్ జవాబిచ్చింది. పాక్ ప్రేరిత ఉగ్రశిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. ఇది పెద్ద స్దాయిలో ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసింది.
ఇందే ఈ నిషేధాలకు కారకమైంది
ఈ ఘటనల నేపథ్యంలో ఏప్రిల్‌లో రెండు దేశాలు గగనతలాలపై ఆంక్షలు విధించుకున్నాయి. ప్రస్తుతం, ఇదే నిర్ణయం మరో నెల పాటు పొడిగించారు.పాక్ మొదట భారత విమానాలకు గగనతలాన్ని మూసింది. దానికి ప్రతిగా భారత ప్రభుత్వం కూడా అదే మార్గాన్ని ఎంచుకుంది.ఈ నిషేధంతో విమానయాన సంస్థలకు నష్టాలే ఎదురవుతాయి. ప్రయాణ సమయం పెరగడం, ఖర్చులు పెరగడం వారి భారం అవుతుంది.
Read Also : APSCSCL : తెలుగు రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రుల సమావేశంలో మంత్రి నాదెండ్ల