నైజీరియాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం క్రీడా ప్రపంచాన్ని కుదిపేసింది.ఓగున్ రాష్ట్రంలోని జాతీయ క్రీడలను ముగించుకుని తిరిగివస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో 21 మంది క్రీడాకారులు, అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నైజీరియా(Nigeria) క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ దుర్ఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రమాదం కానోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దకాసోయే పట్టణం(Dacasoye town) వద్ద జరిగింది. ఓగున్ రాష్ట్ర రాజధాని అబేఒకుటా నుంచి ప్రయాణిస్తున్న కోస్టల్ బస్సు రాత్రంతా ప్రయాణించి ఉదయం 9 గంటల సమయంలో ఓ వంతెనపై నుండి అదుపుతప్పి కింద పడిపోయింది.బస్సులోని ప్రయాణికులను వెంటనే అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొంతమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
క్రీడాకారుల
మరణించిన వారిలో యువ క్రీడాకారులు, సీనియర్ జర్నలిస్టు, వైద్య సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్ అధికారుడు, క్రీడా నిర్వాహకులు ఉన్నారు. ఈ సంఘటనను మరో బస్సులో ప్రయాణిస్తున్న సీనియర్ క్రీడా జర్నలిస్టు ఆడో సలిసు ధృవీకరించారు.అధికారులు ఇంకా అధికారికంగా కారణాలు వెల్లడించనప్పటికీ అక్కడి రహదారి పరిస్థితులు, అలాగే రాత్రంతా ప్రయాణం చేయడం వల్ల ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. నైజీరియా క్రీడా సంఘాలు(Nigeria sports associations) ఈ దుర్ఘటనపై తీవ్రంగా స్పందించాయి. అంతరాష్ట్ర ప్రయాణాల్లో క్రీడాకారుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరణించిన వారి కుటుంబసభ్యులు, సహచరులు వారి కోల్పోయిన ప్రతిభను స్మరించుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. నైజీరియా క్రీడల అభివృద్ధిలో వారికి చేసిన సేవలను గుర్తు చేస్తూ దేశమంతటా నివాళులు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం
నైజీరియాలో రహదారులు చాలా పేలవంగా నిర్వహించబడుతున్నాయి. ఇది దేశంలో ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీని కారణంగా వివిధ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 2024లోనే 9,570 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీరిలో 5,421 మంది మరణించారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. బస్సు వంతెన(Bus Bridge)పై నుంచి కింద పడిపోయినప్పుడు రోడ్డుపై ఇతర వాహనాలు లేవు, డ్రైవర్ అలసట, అతివేగం మాత్రమే కారణమని తెలిసింది.సుమారు 1000 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
Read Also: Shubhman Gill: హార్దిక్ పాండ్యాతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్న శుభ్‌మన్ గిల్