రెండు రోజుల అస్సాం పర్యటనలో భాగంగా డిసెంబర్ 21న నమ్రప్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, అస్సాం (Assam) వ్యాలీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన కొత్త అమ్మోనియా–యూరియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది అస్సాం సహా మొత్తం ఈశాన్య భారత అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన అన్నారు. నమ్రప్, దిబ్రుగఢ్ ప్రాంతాలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న కల నెరవేరుతోందని పేర్కొంటూ, ఈ ప్రాజెక్ట్‌తో పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
Read also: AP: TDP జిల్లా అధ్యక్షులు వీరే!

BJP Government
రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని
ఈ ఆధునిక ఎరువుల కర్మాగారం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని, వ్యవసాయ రంగానికి బలాన్ని చేకూరుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు, కనెక్టివిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. నమ్రప్ యూనిట్ ప్రారంభం తర్వాత వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, ముఖ్యంగా స్థానిక యువతకు శాశ్వత ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం పని చేస్తోందని, నేరుగా రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం అందజేస్తోందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ వలసదారులను రక్షిస్తూ అస్సాం గుర్తింపును ప్రమాదంలోకి నెట్టుతోందని ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల కోసమే కాంగ్రెస్ ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తోందని అన్నారు. అస్సాం సంస్కృతి, భూమి, గౌరవాన్ని కాపాడటానికి బీజేపీ ఉక్కు కవచంలా నిలుస్తుందని హామీ ఇస్తూ, బుజ్జగింపు రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: