ఏపీ లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

ఏపీ లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

ఆంధ్రప్రదేశ్‌లో నేటి ఏపీ లో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్. మార్చి1 నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి రానుంది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించనున్నారు. ప్రభుత్వం రోడ్డుప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. వాహనదారులు ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisements

కొత్త నిబంధనలు

హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 1,000 జరిమానా

సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ. 1,000 ఫైన్

డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే రూ. 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు

సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ కు రూ. 1,000 జరిమానా

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5,000 ఫైన్ తో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం

ఇన్స్యూరెన్స్ లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 2 వేలు, రెండోసారి రూ. 4 వేలు జరిమానా

సెల్ ఫోన్ వాడుతూ వాహనం నడిపితే తొలిసారి రూ. 1,500 రెండోసారి రూ. 10 వేల ఫైన్

బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,000 జరిమానా

వాహనాల రేసింగ్ కు పాల్పడితే తొలిసారి రూ. 5 వేలు, రెండోసారి రూ. 10 వేల ఫైన్

ఆటో డ్రైవర్లు యూనిఫాం లేకుండా వాహనం నడిపితే తొలిసారి రూ. 150, రెండోసారి రూ. 300 జరిమానా.

సీసీ కెమెరాల నిఘా

సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు విధించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నిబంధనలు లోబడి నడుచుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు కోరుతున్నారు.వీటితో పాటుగా అతి వేగం, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి కేసులలో వేయి రూపాయల వరకూ జరిమానా విధిస్తారు. ఇక డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే రూ.5000 జరిమానాతో పాటుగా వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

278983 earphones while driving

హైకోర్టు ఆదేశాలు

ఏపీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హెల్మెట్ విషయంలో ఏపీ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.రాష్ట్రంలో జరుగుతున్న బైక్ యాక్సిడెంట్లపై ఏపీ హైకోర్టు ఇటీవల విచారణ నిర్వహించింది. ఈ తరహా ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు. హెల్మెట్ ధరించి ఉంటే బాధితుల్లో ఎక్కువ శాతం మంది బతికి ఉండేవారని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయాలని పోలీసులను ఆదేశించింది.

ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు

హెల్మెట్ వాడకం పెరిగితే రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.ఏపీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి హెల్మెట్ అమలు చేయనున్నారు.

Related Posts
Anakapalli: బాలిక హాత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష
బాలిక హాత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష

చోడవరం కోర్టులో సంచలనం సృష్టించిన మరణశిక్ష తీర్పు 2015లో చోటుచేసుకున్న ఘాతుకం ఒక బాలికకు సంబంధించినది, ఈ ఘటన ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. Read more

చంద్రబాబుతో అంబుల వైష్ణవి భేటీ
చంద్రబాబుతో అంబుల వైష్ణవి భేటీ

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా, వైష్ణవిని అభినందిస్తూ, రాష్ట్ర Read more

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ : కేంద్రం ఉత్తర్వులు
Visakhapatnam Railway Zone.. Central Orders

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కేంద్రం శుభవార్త అందించింది. చాలాకాలంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికగా మారిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిని నిర్ణయించడంతో పాటు, విశాఖ Read more

TTD: వేసవి రద్దీ కారణంగా సిఫారస్ లేఖల రద్దుకు యోచన!
వేసవి రద్దీ కారణంగా సిఫారస్ లేఖల రద్దుకు యోచన!

తిరుమలలో భక్తుల రద్దీకి తగిన ఏర్పాట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల రద్దీకి అనుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వేసవి సెలవుల సమయంలో Read more

×