బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్, సాధారణంగా గబ్బా అని పిలుస్తారు, ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాజధాని బ్రిస్బేన్‌లోని ఒక ప్రధాన క్రీడా స్టేడియం.శతాబ్ద కాలంగా చరిత్ర కలిగిన గబ్బా స్టేడియం ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన స్టేడియాన్ని కూల్చి వేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వార్త క్రికెట్ అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.
మల్టీపర్పస్ స్టేడియం
ఎన్నో అపూర్వ క్రికెట్ క్షణాలకు వేదికగా నిలిచిన ఈ స్టేడియంను 2032 ఒలింపిక్ గేమ్స్ ముగిసిన తర్వాత కూల్చివేస్తామని క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.2032 ఒలింపిక్ గేమ్స్‌ను బ్రిస్బేన్‌లో నిర్వహించనుండగా, వీటి కోసం విక్టోరియా ప్రాంతంలో సుమారు 60,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో ఓ నూతన మల్టీపర్పస్ స్టేడియంను నిర్మిస్తున్నారు. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత క్రికెట్ మ్యాచ్‌లను అక్కడ నిర్వహించాలని నిర్ణయించారు.
గబ్బా స్టేడియం
మొదట క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం గబ్బా స్టేడియంను పూర్తిగా పునర్నిర్మించాలని భావించింది. దీని కోసం దాదాపు 2.7 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను వెచ్చించాలని నిర్ణయించింది. అయితే, ఇది భారీ వ్యయంగా మారుతుందని ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం చివరకు గబ్బా స్టేడియంను పూర్తిగా కూల్చివేసి, క్రికెట్‌ను కొత్త స్టేడియంకు తరలించాలని ప్రకటించింది.

క్రికెట్ మ్యాచ్
గబ్బా స్టేడియం పూర్తిగా మూతపడేవరకు అక్కడ కొన్ని ముఖ్యమైన ఈవెంట్లు నిర్వహించనున్నారు. వీటిల్లో 2025 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే 2వ మ్యాచ్, అలానే 2032 ఒలింపిక్స్‌లో కొన్ని పోటీలు, గోల్డ్ మెడల్ పతక మ్యాచ్‌లు, వేసవిలో జరిగే కొన్ని వైట్‌బాల్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ప్రత్యేకమైన స్థానం
గబ్బా స్టేడియం క్రికెట్‌లో ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగింది. 1895లో నిర్మించబడిన ఈ స్టేడియం వందేళ్లకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించగా, 1998 నుంచి ఆస్ట్రేలియా జట్టు హోం గ్రౌండ్‌గా ఉపయోగించుకుంటోంది. ఇక్కడ లెజెండరీ క్రికెటర్లు అద్భుత ప్రదర్శనలు కనబరిచారు. 2021లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన గబ్బా టెస్ట్ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది.
అభిమానుల అసంతృప్తి
అధికారిక ప్రకటన ప్రకారం, గబ్బా స్టేడియం 2032 ఒలింపిక్స్ వరకూ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత కొత్త స్టేడియం పూర్తయిన వెంటనే గబ్బాను పూర్తిగా కూల్చివేయనున్నారు. ఒలింపిక్స్ తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు పూర్తిగా కొత్త స్టేడియంలోనే నిర్వహించబడతాయి.ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. గబ్బా స్టేడియంలో అనేక ఆసక్తికరమైన క్రికెట్ మ్యాచ్‌లు జరిగాయి.