డిజిటల్ పేమెంట్ దిగ్గజం ఫోన్‌పేకు చెందిన హైపర్‌లోకల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ పిన్‌కోడ్ సరికొత్త సర్వీస్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు బెంగళూరు, ముంబై, పూణే నగరాల్లో 24X7 మెడిసిన్ డెలివరీ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు ఎప్పుడంటే అప్పుడు మందులను ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఆర్డర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే దగ్గర్లోని మెడికల్ షాపుల నుండి నేరుగా ఇంటికే డెలివరీ పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో లేదా అర్ధరాత్రి వేళల్లో మందులు అవసరమైన వారికి ఈ సేవ నిజంగా ఉపయోగపడనుంది.
కస్టమర్లు ఎంతో ప్రయోజనం
ఈ సర్వీస్ సహాయంతో కస్టమర్లు 10 నిమిషాల్లోనే మందులను డెలివరీ అందుకుంటారు. అలాగే పిన్‌కోడ్ యాప్ లోకల్ మెడికల్ షాపుల నుండి మందులను అందిస్తుంది, ఇంకా దీని ద్వారా లోకల్ వ్యాపారాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఒకవేళ మీ దగ్గర డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే మీరు యాప్‌లో ‘నో ప్రిస్క్రిప్షన్’ అప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత రిజిస్టర్డ్ డాక్టర్ మిమ్మల్ని సంప్రదించి టెలి-కన్సల్టేషన్ తర్వాత డిజిటల్ ప్రిస్క్రిప్షన్ జారీ చేస్తారు. అంతేకాకూండా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మందుల డెలివరీపై ఎటువంటి అదనపు ఛార్జీలు లేవు.

పిన్‌కోడ్ యాప్ సీఈఓ ఏం చెబుతున్నారు అంటే ..
ఈ కొత్త సర్వీస్ గురించి పిన్‌కోడ్ యాప్ సీఈఓ వివేక్ లోచెబ్ మాట్లాడుతూ, “ప్రజలకు మెరుగైన ఇంకా సులభంగా ఆరోగ్య సేవలను అందించడమే పిన్‌కోడ్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా లోకల్ మెడికల్ షాపులు కూడా మంచి ప్రయోజనం పొందాలని మేము కోరుకుంటున్నాము. మా 10 నిమిషాల మెడిసిన్ డెలివరీ సర్వీస్ ప్రజలు ఎటువంటి ఆలస్యం లేకుండా అవసరమైన మందులను పొందడానికి సహాయపడుతుంది” అని అన్నారు. అలాగే “మా సర్వీస్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది ఇంకా ఎవరికైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే మేము డాక్టర్‌తో ఉచితంగా మాట్లాడే సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాము. ఇలా చేయడం ద్వారా ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను సులభంగా అందుబాటులోకి తెస్తోంది. ఈ విధంగా మేము ప్రజలకు సహాయం చేయడమే కాకుండా, డిజిటల్ ప్రపంచంలో రానున్న రోజుల్లో మెడికల్ షాపులను కూడా బలోపేతం చేస్తున్నాము. ఈ ఫీచర్ లోకల్ వ్యాపారాన్ని కూడా ప్రోత్సహిస్తుంది అంతేకాదు నమ్మకమైన మెడికల్ స్టోర్లు మీ ప్రాంతాలలో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి” అని ఆయన అన్నారు. ఇతర నగరాలకు కూడా ఈ సర్వీస్ విస్తరణ: కస్టమర్లకు మందుల డెలివరీ సేవను అందించడంపై పిన్‌కోడ్ దృష్టి కేంద్రీకరించింది. దీనితో పాటు లోకల్ మెడికల్ షాపులను డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకురానుంది. ఈ సర్వీస్ ఇతర నగరాలకు కూడా విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది, ఎందుకంటే దీని ద్వారా ఎక్కువ మంది ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Read Also: DGCA : పాక్ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ