విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కీలకమైన నడికుడి – శ్రీకాళహస్తి (Nadikudi – Srikalahasti) రైల్వే ప్రాజెక్టు మార్గంలో ఇకపై న్యూ పిడుగురాళ్ల శావల్యాపురం మధ్య పాసింజర్ రైలు (Passenger train) అందుబాటులోకి వస్తుంది. ఈ రెండు స్టేషన్లు మధ్య సుదీర్ఘకాల ఎదురు చూపుల అనంతరం తొలిసారి ప్రయాణికుల రైలు పరుగులు పెట్టనుంది.

పాసింజర్ రైలు అందుబాటులో
ఈ రైలు మార్గం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు గూడ్స్ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. జులై 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రతి శుక్రవారం మహారాష్ట్ర నాందేడ్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07189) పల్నాడు జిల్లాలో నడికుడికి రాత్రి 12.05, పిడుగురాళ్లకి రాత్రి 12.30, నెమలపురికి రాత్రి 01.00, 01.25, వినుకొండకు 02.00 గంటలకు చేరుతుంది. మార్కాపురం, దొనకొండ, కంభం, నంద్యాల మీదుగా తిరుపతికి శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు రైలు వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07190) తిరుపతిలో జులై 5వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రతి శనివారం మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి వినుకొండకు రాత్రి 10.05కు, రొంపిచర్ల 10.25కు, నెమలిపురి 10.35కు, పిడుగురాళ్ల 10.45కు, నడికుడి 11.00కి, నాందేడ్కు ఆదివారం ఉదయం 09.30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read also: Special Train: ప్రయాణికులకు శుభవార్త! నాంపల్లి నుంచి కన్యాకుమారికి స్పెషల్ ట్రైన్‌లు