हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

NEET UG Toppers: నీట్ యూజీ ఫలితాల్లో అబ్బాయిలదే పైచేయి

Sharanya
NEET UG Toppers: నీట్ యూజీ ఫలితాల్లో అబ్బాయిలదే పైచేయి

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే అత్యంత ప్రతిష్ఠాత్మక పరీక్ష అయిన NEET UG 2025 ఫలితాలు జూన్ 14న విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అబ్బాయిలదే స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. దేశం మొత్తం మీద టాప్ 10 ర్యాంకుల్లో ఒక్క అమ్మాయికే మాత్రమే స్థానం దక్కగా, మిగిలిన తొమ్మిది ర్యాంకులు అబ్బాయిలే కైవసం చేసుకున్నారు.

టాప్ ర్యాంకర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

ఈసారి టాప్ 10 ర్యాంకుల్లో రాజస్థాన్‌కు చెందిన మహేష్ కుమార్ 99.9999547 పర్సంటైల్ స్కోరుతో దేశంలోనే ఫస్ట్ ర్యాంక్‌ సాధించాడు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవధియా 99.9999095 పర్సెంటేల్‌తో సెకండ్ ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన కృషాంగ్ జోషి 99.9998189 పర్సెంటేల్‌తో థార్డ్ ర్యాంకు కైవసం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన జనరల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు.

టాప్ 10లో తెలుగు విద్యార్థులకు దారిదాపు లేదు

ఈ ఫలితాల్లో టాప్‌ 10 ర్యాంకుల్లో ఒక్క తెలుగు విద్యార్ధికి కూడా చోటు దక్కలేదు. అయితే టాప్‌ 100లో తెలంగాణ విద్యార్థులు పలు ర్యాంకులు సాధించారు. టాప్10 ర్యాంకర్లందరూ జనరల్ కేటగిరీకి చెందిన వారేకావడం మరో విశేషం. టాప్‌ 10లో ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్ అనే అమ్మాయి 99.9996932 పర్సెంటేల్‌తో టాప్‌ 5 ర్యాంకు సాధించింది.

అబ్బాయిలదే పైచేయి

టాప్‌ 10లో మిగతా అందరూ అబ్బాయిలే. నీట్ యూజీ పరీక్ష 720 మార్కులకు నిర్వహించగా గతేడాది 17 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. అయితే ఈసారి ఒక్కరు కూడా 720 మార్కులు సాధించలేదు.

తెలుగు రాష్ట్రాల NEET ఫలితాల విశ్లేషణ:

తెలంగాణ నుంచి:

  • పరీక్ష రాసిన వారు: 70,259 మంది
  • అర్హత సాధించిన వారు: 41,584 మంది
  • ఉత్తీర్ణత శాతం: 59.18%

ఇది గతేడాది కంటే కొంత తగ్గుదల చూపిస్తుంది. 2024లో 77,848 మంది పరీక్ష రాయగా, 47,356 మంది అర్హత సాధించారు. అంటే ఈసారి పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హత పొందిన వారి శాతం రెండింట్లోనూ కొంత తగ్గుదల కనిపించింది.

ఆంధ్రప్రదేశ్ నుంచి:

  • పరీక్ష రాసిన వారు: 57,934 మంది
  • అర్హత సాధించిన వారు: 36,776 మంది
  • ఉత్తీర్ణత శాతం: 63.48%

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఉత్తీర్ణత శాతం తెలంగాణతో పోలిస్తే కొంచెం అధికంగా ఉంది. దీని వల్ల AP విద్యార్థుల ప్రగతిపై కొంత ఆశాజనక ధోరణి కనిపిస్తోంది

Read also: Kedarnath: కేదార్‌నాథ్‌ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు గల్లంతు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870